న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన సతీమణిి సునీతకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఆయనను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కోరారు. అయితే ఇందుకు జైలు అధికారులు అంగీకరించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించింది. సునీత కలిసేందుకు అధికారులు అనుమతించకపోడంపై కారణాలు కూడా చెప్పలేదని పేర్కొన్నాయి.
కాగా ఢిల్లీ మంత్రి ఆతిశీ నేడు 12.30 గంటలకు కేజ్రీవాల్‌ను కలవనున్నారు. మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కూడా అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు.ఈ ఇద్దరి సమావేశాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్థనను తిరస్కరించామని జైలు వర్గాలు తెలిపాయి. ఇద్దరు నేతల భేటీ తర్వాత ఆమెను తన భర్తను కలిసేందుకు అనుమతిస్తామని పేర్కొన్నాయి.
జైలు నియమాల ప్రకారం.. ఒక ఖైదీని ఒకేసారి ఇద్దరు వ్యక్తులు, వారంలో గరిష్టంగా నలుగురు కలవచ్చు. ఇదిలా ఉండగాఢిల్లీ ముఖ్యమంత్రిని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న తన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీఆల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ సతీమణి సునీత ఆప్ తరపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం పశ్చిమ ఢిల్లీ అభ్యర్ధి మహాబల్ మిశ్రా తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన భర్త కేజ్రీవాల్‌ను సింహంతో పోల్చారు. దిల్లీలో పాఠశాలలు నిర్మించడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లీనిక్‌లను ప్రారంభించినందువల్లే తన కేజ్రీవాల్ జైలుకెళ్లారన్నారు. ‘భారతమాత బిడ్డగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి. నియంతృత్వానికి మీ ఓటుతో సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment