Sakshi News home page

బీజేపీకి అర్థం కావడం లేదు!.. మండిపడ్డ మాజీ ఆర్థిక మంత్రి

Published Fri, Mar 29 2024 10:30 AM

Economy In Distress Says P Chidambaram - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ 'తీవ్రమైన సంక్షోభంలో' ఉంది. బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2023 - 24లో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెబుతోంది. ఇదే నిజమైతే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎందుకు తగ్గుతున్నాయి. దీనికి తగిన వివరణ ఎవరూ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఎఫ్‌డీఐ అనేది ఒక దేశం, ప్రభుత్వం.. దాని విధానాలపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని వివరించారు. 

విదేశీ పెట్టుబడిదారులకు 2023-24లో అలాంటి విశ్వాసం బాగా తగ్గిపోయిందని చిదంబరం అన్నారు. బీజేపీ తనకు తానుగానే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటోంది. మంచి సర్టిఫికేట్ అనేది విదేశీ & భారతీయ పెట్టుబడిదారుల నుంచి రావాలని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంపైన పెట్టుబడిదారులు విశ్వాసం వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు.

వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, నిజమైన వేతనాలు నిలిచిపోయాయి, నిరుద్యోగం పెరుగుతోంది.. గృహ వినియోగం తగ్గుతోంది. ఇవి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితమైన సంకేతాలు. కానీ ఇవన్నీ బీజేపీకి అర్థం కావడం లేదు అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement