Lok sabha elections 2024: కంగనా రనౌత్, నవీన్‌ జిందాల్‌కు బీజేపీ టికెట్లు | Lok Sabha Elections 2024: Arun Govil And Kangana Ranaut Named In BJP Fifth List Of Candidates, Details Inside - Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: కంగనా రనౌత్, నవీన్‌ జిందాల్‌కు బీజేపీ టికెట్లు

Published Mon, Mar 25 2024 5:26 AM

Lok sabha elections 2024: Arun Govil, Kangana Ranaut named Iin BJP fifth list - Sakshi

వరుణ్‌ గాందీకి మొండిచెయ్యి  

మరో 111 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో జాబితా విడుదల  

న్యూఢిల్లీ:  లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో 111 మంది అభ్యర్థులతో అధికార బీజేపీ ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. కేంద్ర మంత్రి అశి్వనీకుమార్‌ చౌబే, ఎంపీ వరుణ్‌ గాం«దీకి ఈసారి టికెట్లు నిరాకరించింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్‌ గోవిల్‌ అభ్యర్థిత్వం ఖరారయ్యింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఒడిశాలోని సంబాల్‌పూర్‌ నుంచి, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా పూరీ నుంచి పోటీ చేయబోతున్నారు.

సీనియర్‌ నేత మేనకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నుంచి, పిలిభిత్‌ నియోజకవర్గంలో వరుణ్‌ గాంధీ స్థానంలో ఉత్తరప్రదేశ్‌ మంత్రి జితిన్‌ ప్రసాద, ఇటీవల బీజేపీలో చేసిన సీతా సోరెన్‌ జార్ఖండ్‌లోని దుమ్కా స్థానం నుంచి పోటీకి దిగబోతున్నారు. టీవీ సీరియల్‌ రామాయణంలో రాముడి పాత్ర ధరించిన అరుణ్‌ గోవిల్‌ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి పోటీ చేయనున్నారు.

ఆదివారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ హరియాణాలోని కురు క్షేత్ర నుంచి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ బందోపాధ్యాయ పశ్చిమ బెంగాల్‌లోని తమ్లూక్‌ నుంచి పోటీ చేయబోతున్నారు. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాం«దీపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ పోటీకి దిగబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్‌ హెగ్డేకు ఈసారి అవకాశం కలి్పంచలేదు. 

తన అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేయడం పట్ల బాలీవుడ్‌ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఆదివారం చెప్పారు. ఆమె తన స్వస్థలమైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేయబోతున్నారు. బీజేపీలో చేరడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కంగనా రనౌత్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement