ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ | Sakshi
Sakshi News home page

ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ

Published Wed, May 8 2024 6:55 AM

ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ

విజయనగరం టౌన్‌: ఓటర్లను చైతన్యవంతం చేసి.. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే ఉద్దేశంతో ఎన్నికల భారతం అనే కవితా సంకలనాన్ని ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం ప్రజల ముందుకు తీసుకువచ్చిందని అభ్యుదయవాది జగన్నాథస్వామి అన్నారు. మంగళవారం స్థానిక గురజాడ స్వగృహంలో ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంకలనంలో ఎన్నికల భారతంపై నిర్వహించిన కవితల పోటీలలో ఉత్తమమైన 20 కవితలతో పాటు శ్రీశ్రీ, జాషువా, కాళోజీ వంటి పాతతరం కవులతో పాటు ఈనాటి కవులు పాపినేని శివశంకర్‌, గౌరునాయుడు, స్వామినాయుడు, అనిల్‌ డాడీ వంటి కవుల కవితలు పొందుపరిచినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement