పని ఒత్తిడిలో పోలీసులు.. మున్నాళ్ల ముచ్చటగానే కేసీఆర్‌ ప్రకటన! | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడిలో పోలీసులు.. మున్నాళ్ల ముచ్చటగానే కేసీఆర్‌ ప్రకటన!

Published Thu, May 4 2023 2:20 AM

- - Sakshi

సాక్షి, నిజామాబాద్: పోలీసులు 24 గంటల పాటు విధినిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలు కా పాడుతుంటారు. ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరిగిన నిమిషాల్లో పోలీసులు అక్కడ వాలిపోతుంటారు. పరిస్థితులను పరిశీలించి, తగిన చర్యలు చేపడతారు. విధి నిర్వహణలో వారికి విరామం లేకపోవ డంతో పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నారు.

సిబ్బందికి సెలవులు ఇలా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత పోలీసులకు పని ఒత్తిడి కాకుండా వ్యక్తిగత పనులు చూసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు సెలవు విధానం ప్రవేశపెట్టి మురిపించింది. 2014 నవంబర్‌లో సీఎం కేసీఆర్‌ స్వయంగా పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని ప్రకటించారు. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను బట్టి వారంలో ఇద్దరు లేదా ముగ్గరికి సెలవు ఉండేవి. పోలీస్‌స్టేషన్‌లో ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు ఉంటే వారంలో ప్రతి ఒకరు ఒక రోజు సెలవు తీసుకునే అవకాశం ఉండేది.

మిగిలిన పోలీసులు విధులకు ఉండేవారు. కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ విభాగంలో ఎక్కువగా వారంతరపు సెలవులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మళ్లీ పాత విధానంలోనే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రకటన మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

పోస్టులు భర్తీ చేస్తేనే..
నిజామాబాద్‌ పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలో సిబ్బంది కొరత ఉంది. కొత్త సిబ్బంది వస్తే వారంతరపు సెలవులకు అవకాశం ఉంటుందనే చర్చ పోలీస్‌శాఖలో జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కుటుంబంతో గడపాలని కోరుకుంటారు. విధి నిర్వహణలో పోలీసులకు టైమ్‌కు భోజనం దొరకని పరిస్థితి ఉంటుంది. దీంతో అనారోగ్యం బారిన పడిన సందర్బాలు ఉన్నాయి. సెలవులు ఉంటే పోలీసులకు విరామంతోపాటు పని ఒత్తిడిని సైతం తగ్గించినట్లవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

నెలంతా విధుల్లోనే..
పోలీసు ఉద్యోగంలో 24గంటలు అందుబాటులో ఉ న్నా.. నెలలో నాలుగు రోజుల సెలవులు కూడా ఉండటం లేదు. అయినా ఉద్యోగులకు నెలకు నాలుగు రోజుల జీతం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. దీంతో ఆర్థికంగా శారీరకంగా, మానసికంగా, నష్టపోతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం సెలవులకు అదనంగా చెల్లిస్తే బాగుంటుందని కొందరు పోలీసులు అంటున్నారు.

నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి..

పోలీస్‌ కమిషనర్‌

డీసీపీలు – 3

జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లు – 32

సివిల్‌ పోలీసులు ఏఆర్‌ పోలీసులు(ఆర్ముడ్‌ )

ఏసీపీలు 7 ఏసీపీలు 2

సీఐలు 26 ఆర్‌సీఐలు 5

ఎస్సైలు 81 ఆర్‌ఎస్సైలు 12

ఏఎస్సైలు 85 ఆర్‌ఏఎస్సైలు 34

హెడ్‌కానిస్టేబుల్స్‌ 200 ఆర్‌హెడ్‌కానిస్టేబుల్స్‌ 100

కానిస్టేబుల్స్‌ 679 ఆర్ముడ్‌ కానిస్టేబుల్స్‌ 283

ఓ పోలీసు సిబ్బంది మనోగతం..
నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న పోలీసు ప్రతిరోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు వేరే చోట ఉండటం వారిని వారంలో ఒకసారి కలవడానికి వీలులేకుండా పో తుంది. అలాగే పిల్లల చదువు విషయంలో పాఠశాలకు వెళ్లి వివరాలు తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. సెలవులు ఇచ్చినప్పుడు వారానికి ఒకసారి వెళ్లి తల్లిదండ్రులను చూసేవాడిని ఇప్పు డు ఆ పరిస్థితి లేదు. విరామం లేని విధి నిర్వహణతో బంధువుల శుభకార్యాలకు సైతం వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement