సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు! | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!

Published Wed, Apr 10 2024 6:40 PM

Telangana Cultural Society Singapore Ugadi Celebrations 2024 - Sakshi

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సెంగ్‌ కాంగ్‌లోని అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ వేడుకల్లో బాగంగా పేరి కృష్ణ శర్మ  పంచాంగ శ్రవణం చేశారు. ఆ తరువాత సింగపూర్ స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ జ్యోతిష పండితులు, పంచాంగ కర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు, మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ గార్లు సిద్ధం చేయడం జరిగింది.

ఈ వేడుకల్లో సుమారు 500 వరకు ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి  పులిహోర మొదలగు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి సౌజన్య, జూలూరు పద్మజ, మాదారపు సౌజన్య, దీప నల్లా మరియు బసిక అనిత రెడ్డి, వ్యవరించారు. ఈ ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు, అలాగే  ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్సకు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యంగా ఈ వేడుకలు ఇంతలా ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ కంస్ట్రక్షన్ వారికి, చమిరాజ్ రామాంజనేయులు (టింకర్ టాట్స్), మన్నము శ్రీమాన్ (గరంటో అకాడమీ), రాజిడి రాకేష్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉగాది వేడుకల్లో పప్పు దుర్గా శర్మ గారి వద్ద సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు రామిరెడ్డి శ్రేష్ఠ రెడ్డి, శ్రీవర్షిత రెడ్డి బండి, కంభంపాటి సాయి శాన్వి, లేష్ణ లలిత అన్నం, దేవగుప్తపు సమన్విత, కుప్పం వైష్ణవి సహస్ర, కొండపల్లి చిశితలు అష్టలక్ష్మి, దేవ దేవం భజే కీర్తనలతో ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

(చదవండి: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ!)

Advertisement
Advertisement