మళ్లీ మోసపోతే మనదే తప్పు | Sakshi
Sakshi News home page

మళ్లీ మోసపోతే మనదే తప్పు

Published Fri, Apr 26 2024 6:19 AM

BRS Working President KTR Roadshow at Konaraopet

మొన్న మోసం పార్ట్‌–1, ఇప్పుడు పార్ట్‌–2 

కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకుందాం 

10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్‌ శాసిస్తారు 

కోనరావుపేట రోడ్‌షోలో కేటీఆర్‌ 

సిరిసిల్ల: ఒక్కసారి మోసపోతే.. మోసం చేసిన వాడి ది తప్పు, రెండోసారి మళ్లీ వారి చేతిలోనే మోసపోతే.. తప్పు మనదే అవుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీలో మోదీ.. ఇక్కడ కేడీ.. ఇద్దరూ మోసగాళ్లు, వాళ్ల మాయలో పడొద్దు..  ఆలోచించండి’ అని పిలుపునిచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మోసం పార్ట్‌–1 చూపిస్తే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్ట్‌–2 చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలకేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. రైతుబంధు లేదు, రుణమాఫీ కాలేదు, మహిళలకు రూ.2,500 ఇయ్యలే.. పెన్షన్లు రూ.4వేలకు పెంచలే.. ఇంట్లో ఇద్దరికీ పెన్షన్లు ఇయ్యలే.. కరెంట్‌ లేదు, నీళ్లకు గోస, కరెంట్‌ మోటార్లు కాలుడు.. ఇదంతా కాంగ్రెస్‌ పాలన తీరు.. అని విమర్శించారు. 

భార్యాపిల్లలపై ఎందుకు ఒట్టేయడం లేదు 
పార్లమెంట్‌ ఎన్నికలు కాగానే ఆగస్టులో రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిపై ఒట్టు పెడుతున్నాడని, అదే ఆయన భార్య, పిల్లల మీద ఎందుకు ఒట్టు పెట్టడం లేదని కేటీఆర్‌ నిలదీశారు. దేవుడు ఏమీ అనడని మళ్లీ మోసం చేయొచ్చని సీఎం చూ స్తున్నాడని ఆరోపించారు. రైతుబంధు ఇయ్యనోడు, రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తాడా ? అని ప్రశ్నించారు. రైతుబంధుకు రాంరాం.. అంటున్నారని, ఆ డబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని మో సం చేశారని ఎద్దేవా చేశారు. జనవరి నెల ఆసరా పెన్షన్లను రేవంత్‌రెడ్డి ఎగ్గొట్టారని ఆరోపించారు. 

కాంగ్రెస్‌ హామీలు అమలుకావాలంటే.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలి 
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే.. వాళ్లకు భయం ఉండాలంటే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవాలని కేటీఆర్‌ అన్నారు. 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే.. కేసీఆర్‌ మళ్లీ రాజకీయాలను శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ బండి సంజయ్‌ ఒక్క గుడికి నిధులు తేలేదు.. బడికి నిధులు ఇవ్వ లేదు.. దేవున్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. బండి సంజయ్‌.. అమిత్‌షా చెప్పులు మోసుడు తప్ప ఐదేళ్లలో ఏం చేయనోడికి మళ్లీ ఓట్లు ఎందుకు వేయాలని కేటీఆర్‌ నిలదీశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు 
సిరిసిల్లలో ఒకే రోజు ఇద్దరు నేతకారి్మకులు ఆత్మహ త్య చేసుకోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహించిన కేటీఆర్‌.. సిరిసిల్లను ఉరిసిల్లగా మా ర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడిన నేతకారి్మక కుటుంబాలను గురువారం రాత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున సాయం అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement