సైడ్‌లైట్స్‌ | Sakshi
Sakshi News home page

సైడ్‌లైట్స్‌

Published Sun, Apr 7 2024 7:15 AM

కళాకారుల ఆటాపాట - Sakshi

● మధ్యాహ్నం 3 గంటల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి జనం రావడం ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకు వస్తూ కనిపించారు.

● 5.30 గంటలకు జిల్లా నేతల ప్రసంగాలతో సభ ప్రారంభమైంది.

● శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా రాహుల్‌ గాంధీ భారీ కాన్వాయ్‌తో పోలీసు బందోబస్తు మధ్య 7.10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నాయి.

● ఒకే కారులో రాహుల్‌ గాంధీ ముందు సీటులో కూర్చోగా, మధ్య సీటులో రేవంత్‌ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్‌ రెడ్డి కూర్చొన్నారు.

● రాహుల్‌ ప్రసంగం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రసంగించారు.

● రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి ప్రసంగ సమయంలో కార్యకర్తలు పార్టీ జెండాలతో జోష్‌ కనబరిచారు.

● రాహుల్‌ గాంధీ ప్రసంగాన్ని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలుగులోకి అనువదించారు.

● బడంగ్‌పేట మేయర్‌ పారిజాత, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌, అద్దంకి దయాకర్‌, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఎంపీ డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, ఎంపీ అభ్యర్థులు సునీతారెడ్డి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రులుకొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ తమ ప్రసంగాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు.

● సీతక్క ప్రసంగం ప్రారంభంలో కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

● కళాకారులు ప్రభుత్వానికి అనుకూలంగా తమ పాటలతో ఉత్తేజపరిచారు.

● సభకు జనాన్ని తరలించడానికి ఆర్టీసీతో పాటు ప్రైవేట్‌ బస్సులను తెప్పించారు.

● డప్పు వాయిద్య కళాకారులు శ్రీశైలం హైవే ఈ సిటీ కమాన్‌ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రదర్శనలిస్తూ ముందుకు కదిలారు.

● సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీలపై ప్రజలు నేతల ప్రసంగాలను వీక్షించారు.

● నెహ్రూ ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు, శ్రీశైలం జాతీయ రహదారి, ఈ సిటీ రోడ్లు పూర్తిగా కాంగ్రెస్‌ నాయకుల భారీ ఫ్లెక్సీలతో నిండిపోయాయి.

● మహిళలకు సభా ప్రాంగణంలో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

● వేసవిని దృష్టిలో ఉంచుకొని దాహార్తి తీర్చేందుకు పెద్ద ఎత్తున వాటర్‌ ప్యాకెట్లు, బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.

● ఖమ్మం నుంచి ఎంపీ సీటును ఆశిస్తున్న మల్లు నందిని అనుచరులు పెద్ద ఎత్తున ఆమె ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది.

● రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

● ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తుగా సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కు చేయించారు.

● బహిరంగ సభ అనంతరం పార్టీ శ్రేణులు తిరిగి బస్సుల వద్దకు చేరుకునేందుకు అంధకారం ఉండడంతో అసౌకర్యానికి గురయ్యారు. ట్రాఫిక్‌ సైతం స్తంభించడంతో గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.

● ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడం పోలీసులకు సవాలుగా మారింది.

● మేనిఫెస్టో విడుదల అనంతరం 8.30 గంటలకు సభ ముగిసింది.

– తుక్కుగూడ/పహాడీషరీఫ్‌

Advertisement
Advertisement