వరల్డ్‌ కప్‌లో డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు.. రెండో క్రికెటర్‌గా | Sakshi
Sakshi News home page

WC 2023: వరల్డ్‌ కప్‌లో డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు.. రెండో క్రికెటర్‌గా

Published Thu, Nov 16 2023 9:23 PM

David Warner Joins Rohit Sharma For Huge Record With WC 2023 Semifinal Knock vs SA - Sakshi

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో 10 మ్యాచ్‌లు ఆడిన 528 పరుగులు చేశాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీల్లో వరుసగా రెండు సార్లు 500కు పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా వార్నర్‌ రికార్డులకెక్కాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో వార్నర్‌ ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2019 వరల్డ్‌కప్‌లోనూ వార్నర్‌ 647 పరుగులు చేశాడు. ఇక ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో వార్నర్‌ కంటే ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఉన్నాడు. 2019 వరల్డ్‌కప్‌లో 500కు పైగా పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో కూడా 550 పరుగులు చేశాడు.
చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్‌ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే!

Advertisement
Advertisement