IPL 2023, GT Vs LSG Highlights: Gujarat Titans Beat Lucknow Super Giants By 56 Runs - Sakshi
Sakshi News home page

IPL 2023: గిల్‌, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్‌ ఘన విజయం

Published Mon, May 8 2023 7:18 AM

IPL 2023: Gujarat Titans Beat Lucknow By 56 Runs - Sakshi

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తమ జోరు కొనసాగిస్తోంది. అద్భుత బ్యాటింగ్‌తో భారీ విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్‌ దశకు చేరువైంది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్‌ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (51 బంతుల్లో 94 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్‌ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 74 బంతుల్లోనే 142 పరుగులు జోడించడం విశేషం.

అనంతరం కృనాల్‌ పాండ్యా సారథ్యంలోని లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. డి కాక్‌ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్‌ మేయర్స్‌ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు.  సాహా, గిల్‌ చెలరేగడంతో గుజరాత్‌ వేగంగా దూసుకుపోయింది. మొహసిన్‌ ఓవర్లో సాహా 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో స్కోరు 78 పరుగులకు చేరింది. సాహా 20 బంతుల్లో, గిల్‌ 29 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు.

లక్నో ఎట్టకేలకు 12వ ఓవర్లో తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీయగలిగినా... గిల్‌తో పాటు కెపె్టన్‌ హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిల్లర్‌ (12 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అదే జోరు కొనసాగించి స్కోరును 200 దాటించారు. ఛేదనలో మేయర్స్, ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన డికాక్‌ కూడా ప్రత్యర్థి తరహాలోనే పోటీ పడి పరుగులు సాధిస్తూ ఘనమైన ఆరంభాన్నందించారు. వీరిద్దరి జోరు చూస్తే హోరాహోరీ పోరు తప్పదనిపించింది. అయితే 9వ ఓవర్లో తొలి వికెట్‌గా మేయర్స్‌ వెనుదిరగ్గా...ఆ తర్వాత లక్నో పరిస్థితి  అంతా ఒక్కసారిగా తలకిందులైంది.   

  • మైక్‌ హస్సీ, డేవిడ్‌ హస్సీ తర్వాత ఒక టి20 మ్యాచ్‌లో కెపె్టన్‌ హోదాలో అన్నదమ్ములు (కృనాల్, హార్దిక్‌ పాండ్యా) ప్రత్యర్థులుగా తలపడటం ఇది రెండోసారి మాత్రమే.   

స్కోరు వివరాలు .. 
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: వృద్ధిమాన్‌ సాహా (సి) (సబ్‌) ప్రేరక్‌ మన్కడ్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 81; శుబ్‌మన్‌ గిల్‌ (నాటౌట్‌) 94; హార్దిక్‌ పాండ్యా (సి) కృనాల్‌ పాండ్యా (బి) మొహసిన్‌ 25; మిల్లర్‌ (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 227.
వికెట్ల పతనం: 1–142, 2–184. 
బౌలింగ్‌: మొహసిన్‌ 3–0–42–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–34–1, కృనాల్‌  పాండ్యా 4–0–38–0, యష్‌ ఠాకూర్‌ 4–0–48–0, రవి బిష్ణోయ్‌ 2–0–21–0, మేయర్స్‌ 1–0–16–0, స్వప్నిల్‌ 1–0–7–0, స్టొయినిస్‌ 1–0–20–0.  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) రషీద్‌ ఖాన్‌ (బి) మోహిత్‌ శర్మ 48; డికాక్‌ (బి) రషీద్‌ 70; దీపక్‌ హుడా (సి) రాహుల్‌ తెవాటియా (బి) షమీ 11; స్టొయినిస్‌ (సి) షమీ (బి) మోహిత్‌ శర్మ 4; నికోలస్‌ పూరన్‌ (సి) షమీ (బి) నూర్‌ అహ్మద్‌ 3; ఆయుశ్‌ బదోని (సి) నూర్‌ (బి) మోహిత్‌ శర్మ 21; స్వప్నిల్‌ (నాటౌట్‌) 2; కృనాల్‌ పాండ్యా (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ శర్మ 0; బిష్ణోయ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1–88, 2–114, 3–130, 4–140, 5–153, 6–166, 7–166.
బౌలింగ్‌: షమీ 4–0–37–1, హార్దిక్‌ పాండ్యా 3–0–37–0, రషీద్‌  ఖాన్‌ 4–0–34–1, నూర్‌ అహ్మద్‌ 4–0–26–1, మోహిత్‌ శర్మ 4–0–29–4, జోసెఫ్‌ 1–0–5–0.  


 

Advertisement
 
Advertisement
 
Advertisement