దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో దూసుకుపోతున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 468 పాయింట్లు పెరిగి 23,290 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1618 పాయింట్లు ఎగబాకి 76,693 వద్ద ముగిసింది.
మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో దూసుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం భారీగా కుప్పకూలిన స్టాక్‌మార్కెట్ సూచీలు వరుసగా లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీలో భాగంగా కీలక వడ్డీరేట్లును యథాతథంగా ఉంచింది. భారత జీడీపీ అభివృద్ధిపై సానుకూలంగా స్పందించడంతో మార్కెట్లు శుక్రవారం భారీగా పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్‌ఎం, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, భారతీఎయిర్‌టెల్, టైటాన్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment