దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 23,555కు చేరింది. సెన్సెక్స్ 54 పాయింట్లు ఎగబాకి 77,631 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.32 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 2.24 శాతం దిగజారింది.
కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ.22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment