దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయి 23,294కు చేరింది. సెన్సెక్స్ 668 పాయింట్లు దిగజారి 76,931 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ క్రితం ముగింపు వద్దే కదలాడింది. నాస్‌డాక్ 0.11 శాతం దిగజారింది.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను గణనీయంగా ఉపసంహరిస్తున్నారు. రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు పెద్దగా లాభాలు పోస్ట్ చేయకపోవడం మార్కెట్‌లకు ప్రతికూలంగా మారింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మార్కెట్ అస్థిరతకు కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా మందగించిన పారిశ్రామికోత్పత్తి వృద్ధి కూడా మార్కెట్ తిరోగమనానికి కారణమని చెబుతున్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. దాంతో అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment