IPL 2024 DC vs GT: ఉత్కంఠ పోరులో గుజరాత్‌ ఓటమి.. | Sakshi
Sakshi News home page

IPL 2024 DC vs GT: ఉత్కంఠ పోరులో గుజరాత్‌ ఓటమి..

Published Thu, Apr 25 2024 3:24 PM

IPL 2024: Gujarat Titans vs Delhi capitals Live Score, Updates And Highlights

IPL 2024 DC vs GT Live Updates:

ఉత్కంఠ పోరులో గుజరాత్‌ ఓటమి..
అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమి పాలైం‍ది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోరి దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

ఆఖరి ఓవర్‌లో గుజరాత్‌ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. రషీద్‌ ఖాన్‌ 14 పరుగులు మాత్రమే రాబట్టాడు. గుజరాత్‌ బ్యాటర్లలో సాయిసుదర్శన్‌(65) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్‌ మిల్లర్‌(55), వృద్దిమాన్‌ సాహా(39) తమ వంతు ప్రయత్నం చేశారు. ఢిల్లీ బౌలర్లలో రాసిఖ్ ధార్‌ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్‌ యాదవ్‌ రెండు, అక్షర్‌ పటేల్‌, నోర్జే తలా వికెట్‌ సాధించారు.

అంతకుముం‍దు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్‌ రిషబ్‌ పం‍త్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. పంత్‌తో పాటు అక్షర్‌ పటేల్‌(66) పరుగులతో రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్‌ ఆహ్మద్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..
డేవిడ్‌ మిల్లర్‌ రూపంలో గుజరాత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిల్లర్‌.. ముఖేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్‌ విజయానికి 12 బంతుల్లో 37 పరుగులు కావాలి.

17 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 176/6

17 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్‌ మిల్లర్‌(51), రషీద్‌ ఖాన్‌(0) ఉన్నారు.

ఐదో వికెట్‌ డౌన్‌..
షారూఖ్‌ ఖాన్‌ రూపంలో గుజరాత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన షారూఖ్‌..రాసిఖ్ సలామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి షారూఖ్‌ ఖాన్‌ వచ్చాడు. 15 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 147/5

నాలుగో వికెట్‌ డౌన్‌..
121 పరుగుల వద్ద గుజరాత్‌ టైటాన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 65 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌.. రాసిఖ్ సలామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి షారూఖ్‌ ఖాన్‌ వచ్చాడు. 14 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 139/4

మూడో వికెట్‌ డౌన్‌..
ఒమర్జాయ్‌ రూపంలో గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఒమర్జాయ్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్‌(59), మిల్లర్‌(2) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌..
95 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు వృద్దిమాన్‌ సహా.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఒమర్జాయ్‌ వచ్చాడు.

3 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 41/1

3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో వృద్దిమాన్‌ సహా(26), సాయిసుదర్శన్‌(8) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..
225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. నోర్జే బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రిషబ్ పంత్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ 225 పరుగులు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్‌ రిషబ్‌ పం‍త్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. పంత్‌తో పాటు అక్షర్‌ పటేల్‌(66) పరుగులతో రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్‌ ఆహ్మద్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు.

19 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 193/4

19 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్‌ పంత్‌(58), స్టబ్స్‌(26) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌..
157 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 66 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌.. నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 157/4. క్రీజులో రిషబ్‌ పంత్‌(48), స్టబ్స్‌ పరుగులతో ఉన్నారు.

అక్షర్‌ పటేల్‌ ఫిప్టీ..
15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ పొందిన అక్షర్‌ పటేల్‌ అదరగొడుతున్నాడు. అక్షర్‌ కేవలం 37 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. క్రీజులో అక్షర్‌ పటేల్‌(50), రిషబ్‌ పం‍త్‌(34) పరుగులతో ఉన్నారు.

ఢిల్లీ మూడో వికెట్‌ డౌన్‌.. హోప్‌ ఔట్‌
హోప్‌ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హోప్‌.. సందీప్‌ వారియన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఢిల్లీ మూడు వికెట్లు నష్టపోయి 68 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్‌ పటేల్‌(19), రిషబ్‌ పం‍త్‌(7) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్‌
పృథ్వీ షా రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన పృథ్వీషా.. సందీప్‌ వారియర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఢిల్లీ రెండు వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది.

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. మెక్ గర్క్ ఔట్‌
34 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌.. సందీప్‌ వారియర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్‌ పటేల్‌ వచ్చాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా ఢిల్లీ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), శుభమాన్ గిల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

Advertisement
Advertisement