Sakshi News home page

IPL 2024: లక్నో అభిమానులకు గుడ్‌న్యూస్‌.. కెప్టెన్‌ వచ్చేశాడు!

Published Mon, Mar 4 2024 1:44 PM

Is KL Rahul To Miss IPL 2024 Due To Injury Report Gives Massive Update - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ లండన్‌ నుంచి తిరిగి వచ్చినట్లు సమాచారం. ఆదివారమే అతడు భారత్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది.

కాగా తొడ కండరాల నొప్పి కారణంగా కర్ణాటక బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ భారత జట్టుకు దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తర్వాత మళ్లీ మైదానంలో దిగలేదు. ఈ క్రమంలో స్టోక్స్‌ బృందంతో మిగిలిన నాలుగు టెస్టులకూ దూరమైన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. మెరుగైన చికిత్స కోసం లండన్‌కు వెళ్లాడు.

ఫలితంగా రాహుల్‌ గాయం తీవ్రత ఎక్కువైందని.. ఐపీఎల్‌-2024 ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ కీలక అప్‌డేట్‌ అందించాయి.

‘‘లండన్‌లో వైద్య నిపుణులను కలిసేందుకు రాహుల్‌ అక్కడికి వెళ్లాడు. ఆదివారమే అతడు ఇండియాకు తిరిగి వచ్చాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్సీఏ)లో ప్రస్తుతం పునరావాసం పొందుతున్నాడు. 

త్వరలోనే ఎన్సీఏ నుంచి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన రిటర్న్‌ టు ప్లే సర్టిఫికెట్‌ అందుకుంటాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌.. గతేడాది ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డాడు.

ఆ తర్వాత జట్టుకు పూర్తిగా దూరమైన అతడు.. తొడ కండరాల గాయంతో లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం వన్డే వరల్డ్‌కప్‌-2023 సహా పలు ద్వైపాక్షికి సిరీస్‌లలో సత్తా చాటాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టెస్టు సందర్భంగా మళ్లీ గాయపడ్డాడు. అయితే, ఐపీఎల్‌-2024లో లక్నో ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చదవండి: కోహ్లి, గిల్‌ కాదు!.. ఈసారి ఆరెంజ్‌ క్యాప్‌ అతడిదే! పర్పుల్‌ క్యాప్‌ నాది!

Advertisement

What’s your opinion

Advertisement