గోవా ఐఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికై న శ్రీకాకుళం వాసి | Sakshi
Sakshi News home page

గోవా ఐఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికై న శ్రీకాకుళం వాసి

Published Sat, Dec 23 2023 4:30 AM

డాక్టర్‌ సువ్వారి ఆనందరావు  - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన డాక్టర్‌ సువ్వారి ఆనందరావు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యో గం సాధించారు. ఆయన స్వస్థలం ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపేట గ్రామం. అత్యున్నత ప్రమాణాలు కలిగిన గోవా ఐఐటీ సంస్థలో ఆర్థిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా డాక్టర్‌ ఆనందరావు ఉగ్యోగానికి ఎంపికయ్యాడు. శుక్రవారమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. కమ్మవారిపేటకు చెందిన సువ్వారి నీలాచలం, పద్మావతిలు ఆనంద రావు తల్లిదండ్రులు. పాఠశాల స్థాయి నుంచి ఆనందరావు చదువుల్లో చురుగ్గా ఉండేవారు.

ప్రాథమిక విద్య అనంతరం ఎకనామిక్స్‌పై ఆసక్తితో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఐఎంఏలో చేరి ఉత్తీర్ణులయ్యారు. అక్కడే క్యాంపస్‌ ఇంటర్వ్యూ ద్వారా ఓ బీమా సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేశారు. అయితే పరిశోధనలపై ఉన్న ఆసక్తితో ‘ఎఫీషియన్సీ అండ్‌ ఫెర్మార్మన్స్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ ఇండస్ట్రీ, సమ్‌ న్యూ ఎవిడెన్స్‌ ఫర్‌ ఇండియా’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తిచేసి చేసి డాక్టరేట్‌ అందుకున్నారు. అనంతరం ఆయన 2019 జూలై నుంచి 2020 వరకు ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌ విభాగంలో అధ్యాపకులుగా పనిచేశా రు.

2020 నవంబరు నుంచి 2023 జనవరి వరకూ ఏపీ ఎస్‌ఆర్‌ఎం విశ్వ విద్యాలయంలో సహాయ ఆచార్యునిగా, ఎకనామిక్స్‌ హెచ్‌ఓడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2023 నుంచి హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ (ఐఎంటీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచే స్తూ.. తాజాగా ప్రతిష్టాత్మక ఐఐటీ గోవాలో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఆయన ప్రచురించిన జర్న ల్స్‌ అంతర్జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి.

Advertisement
Advertisement