-
మనీలాండరింగ్ యాక్ట్‌లో ఈడీ అరెస్టుపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 19 ప్రకారం నిందితుడుని అరెస్ట్ చేసే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాలను సుప్రీంకోర్టు తగ్గించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది. ఒకవేళ సదరు నిందితుడిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలంటే ఈడీ తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం పీఎంఎల్ కేసులో ఈడీ అరెస్ట్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత.. కేసులో నిందితుడిగా చూపిన వ్యక్తిని సెక్షన్ 19 కింద అరెస్టు చేయడానికి ఈడీ అధికారులకు అధికారం ఉండద సుప్రీం పేర్కొంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లకు నిందితుడు న్యాయస్థానం ఎదుట హాజరైతే దాన్ని కస్టడీలో ఉన్నట్లుగా పరిగణించకూడదని తెలిపింది‘ఈడీ ఫిర్యాదును దాఖలు చేసే వరకు నిందితులను అరెస్టు చేయని కేసుల్లో, ఆ తర్వాత కూడా వారిని అరెస్టు చేయకూడదు. ముందుగా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి సమన్లు జారీ చేస్తుంది. ఆ సమన్లకు నిందితులు స్పందించి కోర్టులో హాజరైతే వారు కస్టడీలో ఉన్నట్లు పరిగణించకూడదు. ఒకవేళ సదరు వ్యక్తి ప్రత్యేక కోర్టుకు సమాధానం ఇచ్చిన తర్వాత అతడిని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే.. దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని విశ్వసిస్తే విచారణకు అనుమతిస్తుంది’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భయన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.నిందితుడు కోర్టు సమన్లకు సమాధానం ఇవ్వడంలో విఫలమైతే మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 70 కింద అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అది కూడా బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయి ఉండాలని తెలిపింది.కాగా పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 ఈడీ అధికారులకు తన వద్ద ఆధారాల ఆధారంగా.. కేసులోని నిందితులను నేరుగా అరెస్ట్ చేసే అధికారాన్ని, స్టేట్మెంట్ రికార్డ్ చేసే అధికారాన్ని కల్పిస్తుంది. అయితే అరెస్ట్‌కు గల కారణాలను ఈడీ సంబంధిత వ్యక్తులకు వీలైనంత త్వారగా తెలియజేయాల్సి ఉంటుంది. -
Amit Shah: కేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ !
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ సాధారణ ‘ప్రక్రియ’లాగా లేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించారు. బుధవారం ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా పలు అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..జడ్జీలు ఇది గమనించాలి‘‘కేజ్రీవాల్‌కు ఎన్నికల సందర్భంగా బెయిల్ రావడం చూస్తుంటే సుప్రీంకోర్టు ఆయన విషయంలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఈ మాట నేను అనట్లేదు. దేశవ్యాప్తంగా చాలా మంది ఇలాగే భావిస్తున్నారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే తాను మళ్లీ జైలు కెళ్లాల్సిన అవసరం రాదని బెయిల్ తర్వాత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు పూర్తిగా కోర్టు ధిక్కారమే. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే వాళ్లను సుప్రీంకోర్టు జైలుకు పంపదని ఆయన మాటల్లోని అసలు అర్థం. ఆయన మాటలు విన్నాక అయినా ఆయనకు బెయిల్ ఇచ్చిన జడ్జీలు.. కేజ్రీవాల్ బెయిల్‌ను ఎలా వాడుకుంటున్నారు, ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి’’ అని షా విజ్ఞప్తిచేశారు.బెయిల్ తీర్పుపై..‘‘చట్టాన్ని ఏ కేసుల్లో ఎలా ఆపాదించాలో సర్వోన్నత న్యాయస్థానానికి బాగా తెలుసు. అయితే ఈ ఒక్క కేజ్రీవాల్ బెయిల్ విషయంలో మాత్రం కోర్టు ఇచ్చిన తీర్పు మిగతా తీర్పుల్లా సాధారణంగా అనిపించట్లేదు. దేశ జనాభాలో చాలా మంది మససుల్లో ఇలాంటి భావనే నెలకొంది. తిహార్ జైలు అమర్చిన కెమెరాల సీసీటీవీ ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. అది పూర్తిగా అబద్దం. ఎందుకంటే తిహార్ జైలు కేంద్రం అధీనంలో ఉండదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది అని వివరించారు.ప్రధానిగా మోదీ రిటైర్మెంట్పై‘‘వచ్చే ఏడాదికి మోదీకి 75 ఏళ్లు వస్తాయి. 75కి చేరినందుకు బీజేపీ నియమావళి ప్రకారం మోదీని పక్కనబెట్టి అమిత్‌షాను ప్రధాని చేయాలని చూస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అదంతా అబద్ధం. ఇప్పుడు, ఎప్పుడూ మోదీయే మా ప్రధాని అభ్యర్థి. మేం గెలిచాక 2029 ఏడాదిదాకా మోదీయే ప్రధానిగా కొనసాగుతారు. ఆయన సారథ్యం, మార్గదర్శకత్వంలోనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తాం’’ అని అమిత్ అన్నారు. -
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
రాంచీ: జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. రాంచీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌లో అలమ్‌ను మంగళవారం(మే14) తొమ్మిది గంటలు ఏకబిగిన ప్రశ్నించిన అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసింది.గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాల్లో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో అలమ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ అలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌కుమార్ లాల్ పనిమనిషి ఇంట్లో రూ.37 కోట్ల లెక్కల్లోకి రాని నల్లధనం పట్టుబడిన విషయం తెలిసిందే. పనిమనిషి ఫ్లాట్‌లో గుట్టలుగుట్టలుగా నల్లధనం పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడం గమనార్హం. -
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాధవాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు. బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ అధికారులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్‌లపై కేసులు నమోదు చేశారు. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో అరెస్ట్ ఈ కేసుకు సంబంధించి 2022లో ధీరజ్‌ను సీబీఐ చార్జిషీట్లో చేర్చింది. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్‌ను గతంలో సీబీఐ అరెస్ట్ చేస్తే బెయిల్‌పై విడుదలైనట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా వాధావాన్ అరెస్ట్‌పై 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,000 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ డీహెచ్ఎఫ్ఎల్ కేసు నమోదు చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా నిలిచిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారునేరపూరిత కుట్రకుయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధవన్ ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్రలో భాగంగా వాధవాన్లు రూ. 42,871.42 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేందుకు కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారని ఏజెన్సీ తెలిపింది.నిందితులు డీహెచ్ఎఫ్ఎల్ లెక్కల్ని తారుమారు చేసింది. ఆ నిధుల్ని వినియోగించడం, దుర్వినియోగం చేశారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధంగా బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని సీబీఐ అధికారులు వెల్లడించారు. -
కెనడా నిజ్జర్ కేసు: మరో అనుమానితుడు అరెస్ట్
అట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిజ్జర్ కేసులో కెనడా పోలీసులు మరో అనుమానితుడిని అరెస్టు చేశారు. దీంతో, ఈ కేసులో నాలుగో వ్యక్తి అమర్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ కేసులో మరో అనుమానితుడు అమర్దీప్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాంప్టన్ ప్రాంతంలో ఉంటున్న అమర్‌దీప్‌ను అరెస్ట్ చేసినట్టు అధికారికంగా తెలిపారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కరన్ బ్రార్, కమల్ ప్రీత్ సింగ్, కరన్ ప్రీత్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌కు చెందిన వీరు ముగ్గురు ప్రస్తుతం ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసముంటున్నారు. మరోవైపు, ఈ పరిణామాల వెనక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని భారత విదేశాంగా శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు విషయంలో కెనడా కేవలం సమాచారం మాత్రమే ఇచ్చిందని తెలిపింది. అధికారికంగా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని పేర్కొంది. వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు కెనడా సర్కారు రాజకీయ వేదిక కల్పించిందని మరోసారి స్పష్టం చేసింది. గత ఏడాది జులై 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు చేశారు. -
లైంగిక వేధింపుల కేసు: పోలీసుల అదుపులో బీజేపీ నేత
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన బీజేపీ నేత జీ. దేవరాజే గౌడపై లైంగిక ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు జీ దేవరాజే గౌడను అదుపులోకి తీసుకున్నారు. దేవరాజే గౌడ బెంగళూరు నుంచి చిత్రదుర్గకు ప్రయాణిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 36 ఏళ్ల ఓ మహిళ జీ దేవరాజేపై లైంగిక దాడి ఫిర్యాదు చేయగా.. పోలీసు కేసు నమోదు చేశారు. తనకు సంబంధించిన ఓ స్థలాన్ని అమ్మటంలో సాయం చేయాలని కోరగా.. తనపై దేవరాజే గౌడ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.దేవరాజే గౌడ.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణపై పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే రేవణ్ణపై ఉన్న లైంగిక ఆరోపణల విషయంలో బీజేపీ అధిష్టాన్ని అప్రమత్తం చేశారు. అదే విధంగా పొత్తులో భాగంగా హాసన్ పార్లమెంట్ టికెట్ ప్రజ్వల్‌కు కేటాయించవద్దని కూడా తెలిపారు. అయినా బీజేపీ, జేడీఎస్ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని ప్రజ్వల్ కేటాయించిన విషయం తెలిసిందే.ఇక.. ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అభ్యంతక వీడియోలు వైరల్ తర్వాత ఆయన జర్మనీ వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వంలో దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ కోసం బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. ప్రజ్వల్ తండ్రి హెచ్.డీ రేవణ్ణ ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. -
పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
మిర్పూర్: పన్నుల పెంపు, నిరసనకారుల అరెస్టులపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో శుక్రవారం నిరసనలు భగ్గుమన్నాయి. మిర్పూర్ జిల్లా దద్యాల్ తహశీల్ పరిధిలో నిరసనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతోపాటు వారితో తలపడ్డారు. బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టాయి. కొన్ని టియర్ గ్యాస్ తూటాలు సమీపంలోని పాఠశాల ఆవరణలో పడగా విద్యార్థినులు గాయపడ్డారు.పెరుగుతున్న ధరలు, పన్ను భారం, విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయనుందుకు ఆగ్రహిస్తూ జమ్మూకశ్మీర్ జాయింట్ ఆవామీ కమిటీ 10వ తేదీన శుక్రవారం బంద్‌కు, 11న లాంగ్ మార్చ్‌కి పిలుపునిచి్చంది. దీంతో, భద్రతా బలగాలు గురువారం కమిటీ నాయకులు సహా 70 మందిని అదుపులోకి తీసుకున్నాయి. -
AP: భారీగా మద్యం స్వాధీనం.. టీడీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీ ఎన్నికల వేళ టీడీపీ పార్టీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, భారీగా మద్యం పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల నుంచి సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సెబ్ అధికారులు. తిరువూరు జిల్లాలో 21 సంచుల్లో 4200 మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నేతలు తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మోదుగు వెంకటేశ్వరరావు, షేక్ షాహిన్ పాషా, జీనుగు అశోక్‌ను అరెస్ట్ చేశారు. -
మేఘాలయలో హిట్లర్‌ను అరెస్టు చేసిన కెన్నెడీ?
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి. మన దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కొన్ని వింతలు కనిపిస్తూ ఉంటాయి. 2008 మేఘాలయ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. నాడు కెన్నెడీతో పాటు హిట్లర్ పేరు వార్తాపత్రికల ముఖ్యాంశాల్లో కనిపించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ ఘటనను ‘ఎన్నికల కథనాలు’లో పంచుకుంది.2008లో మేఘాలయలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పత్రికల్లో ఒక షాకింగ్ న్యూస్ ప్రచురితమైంది. ‘జాన్ ఎఫ్ కెన్నెడీ స్వయంగా అడాల్ఫ్ హిట్లర్‌ను అరెస్టు చేశారు’ అనేది దాని హెడ్డింగ్. ఆ రెండు పేర్లకు చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో ఈ వార్త దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నఅప్పటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి అడాల్ఫ్ లూ హిట్లర్ మారక్‌ను ఏదో కేసులో అక్కడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ ఎఫ్ కెన్నెడీ అరెస్టు చేశారు. మరుసటి రోజు వార్తాపత్రికల్లో ‘జాన్ ఎఫ్ కెన్నెడీ చేతుల మీదుగా అడాల్ఫ్ లూ హిట్లర్ అరెస్ట్’ అనే శీర్షికతో ఈ వార్తను ప్రచురించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. నాటి ఎన్నికల ఫలితాల్లో హిట్లర్ విజయం సాధించారు.లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లొ పోస్ట్ చేసింది. గత ఏడాది అడాల్ఫ్ హిట్లర్ మారక్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా 35వ అధ్యక్షుడు. అతను 1961 నుండి నవంబర్ 1963లో హత్యకు గురయ్యే వరకు ఈ పదవిలో కొనసాగారు. అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ ఒకప్పటి జర్మనీ నియంత. ఆయన 1945లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. #Chunaviकिस्सेभारतीय चुनावों से जुड़े रोचक किस्से 🙌#ECI #ChunavKaParv #DeshKaGarv #Elections2024 pic.twitter.com/1o88yQB3B2— Election Commission of India (@ECISVEEP) March 18, 2024 -
కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: మహిళ కిడ్నాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీ (ఎస్) సీనియర్ నేత, పార్టీ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను సిట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన పెట్టుకున్న ముందస్తు బె యిల్‌ను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ని రాకరించిన వెంటనే సిట్ రేవణ్ణను అదుపులో కి తీసుకోవడం గమనార్హం. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన బాధితురాలిని రేవణ్ణ అనుచరుడు సతీశ్ బాబన్న కిడ్నాప్ చేశాడని బాధితురాలి కుమారుడు గురువారం రాత్రి మైసూరులో ఫిర్యాదుచేయ డంతో పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం బెంగళూరులోని పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నివాసంలో ఉన్న రేవణ్ణను అక్కడే అరెస్ట్‌చేశారు. తర్వాత ఆయనను బౌరింగ్ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ కేసులో రేవణ్ణ సహచరుడు సతీశ్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు. ఈ కే సులో నిర్బంధంలో ఉన్న మహిళను మైసూ రు జిల్లాలోని కలెనహళ్లి గ్రామంలోని ఫామ్‌హౌజ్‌లో పోలీసులు శనివారం కాపాడారు. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీస్!: లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌పై నమోదైన కేసులో విచారణను సిట్ వేగవంతంచేసింది. ఇందులోభాగంగా ప్రజ్వల్‌కు సీబీఐ బ్లూ కార్నల్ నోటీసును జారీచేసే వీలుందని తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిట్ అధికారులతో ముఖ్యమైన సమావేశం ఏర్పాటుచేశారు. ప్రజ్వల్‌ను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేలా కేసు దర్యాప్తును ముమ్మరంచేయాలని ఆదేశించారు. -
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
బెంగళూరు: మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను బెంగళూరు పోలీసులు శనివారం(మే4) అరెస్టు చేశారు. రేవణ్ణ తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రేవణ్ణ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలోనే పోలీసులు రేవణ్ణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ సంచలనం రేపిన సెక్స్ వీడియోల స్కాండల్ కేసులో కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈయనపై సెక్స్ స్కాండల్ కేసులో పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. -
నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
ఒట్టావా: భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు భారతీయులే కావడం గమనార్హం. కరణ్ బ్రార్(22), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ ప్రీత్ సింగ్(28)లను అరెస్ట్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎడ్మోంటన్‌లోని అల్బెర్టాలో ఉంటున్నారని.. వారికి అక్కడే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరు 3 నుంచి 5 ఏళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు నిజ్జర్ హత్యలో భారత్‌కు ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని.. వారిని కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.గతేడాది జూన్ 18న కెనడా బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సు సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య కేసులో భారత్‌కు సంబంధించిన ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. -
Israel-Hamas war: వర్సిటీల్లో 2,300 దాటిన అరెస్టులు
న్యూయార్క్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ అమెరికావ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు ఆగట్లేవు. పోలీసులు వర్సిటీల్లో ఆందోళనకారులను చెదరగొట్టి తాత్కాలిక శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 17న కొలంబియా వర్సిటీలో మొదలై అమెరికాలో 44 విశ్వవిద్యాలయాలు/ కాలేజీలకు పాకిన ఈ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటిదాకా 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం న్యూయార్క్ యూనివర్సిటీలో టెంట్లను ఖాళీచేసి వెళ్లాలని నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో 133 మందిని అరెస్ట్‌చేశారు. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
గత కొన్ని రోజులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ‘డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో’ కేసులో అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.అరుణ్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్' అనే ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాండిల్ చేసేవారు. ఇటీవల విడుదలైన డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో దేశంలోని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి చెప్పినట్లు వినిపిస్తోంది. ఈ వైరల్ వీడియో క్లిప్ ఫేక్ అని బీజేపీ స్పష్టం చేసింది.డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని వివిధ సెక్షన్ల కింద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నలుగురు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సభ్యులకు (శివ కుమార్ అంబాల, అస్మా తస్లీమ్, సతీష్ మన్నె, నవీన్) పోలీసులు గతంలో సమన్లు జారీ చేశారు.అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్ ఈ రోజు (శుక్రవారం) కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.Delhi Police arrest Arun Reddy, who handles the 'Spirit of Congress' X account, in the Union Home Minister Amit Shah doctored video case: Delhi Police pic.twitter.com/gB5L6Pzcbp— ANI (@ANI) May 3, 2024 -
డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే ఏమిటి? ఎలా ఎదుర్కోవాలి?
జనాన్ని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త మార్గాలను కనుగొంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ పేరిట నూతన తనహా వంచనకు తెర లేపుతున్నారు. ఈ పద్దతిలో సైబర్ నేరగాళ్లు పోలీసు, సీబీఐ లేదా కస్టమ్స్ అధికారులుగా నటించి, తాము టార్గెట్ చేసుకున్న వారికి ఫోన్ చేసి, వారిని ఇంట్లో బందీలుగా మారుస్తున్నారు. అనంతరం వారి బ్యాంక్ ఖాతాలోని సొమ్మును స్వాహా చేసేస్తున్నారు. ఇదే కోవలో ఇంటి తాకట్టు మోసానికి సంబంధించిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.ఆర్బీఐ ఇటీవల వెలువరించిన ఒక నివేదికలోని వివరాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రూ. 302.5 బిలియన్లు అంటే రూ. 30 వేల కోట్లకు పైగా డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో అంటే జూన్ 1, 2014 నుండి మార్చి 31, 2023 వరకు భారతీయ బ్యాంకులలో 65,017 మోసం కేసులు నమోదయ్యాయి. రూ. 4.69 లక్షల కోట్ల మేరకు చీటింగ్ జరిగింది. యూపీఐ స్కామ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, ఓటీపీ స్కామ్, జాబ్ స్కామ్, డెలివరీ స్కామ్ మొదలైన వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతి ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది.మోసగాళ్లు తాము టార్గెట్ చేసుకున్నవారిని ఇంట్లో బంధించి, వారిని మోసం చేసేందుకు ఈ కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. ముందుగా సైబర్ నేరగాళ్లు బాధితులకు డబ్బులు చెల్లించాలని ఆడియో, వీడియో కాల్స్ చేస్తూ, అలజడి వాతావరణాన్ని సృష్టిస్తారు. స్కామర్లు ఏఐ సాయంతో రూపొందించిన వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా పోలీసులు లేదా అధికారుల మాదిరిగా నటించి, బాధితుల ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్‌తో తప్పులు దొర్లాయని చెబుతారు. ఇంతటితో ఆగకుండా ఆ మోసగాళ్లు అధికారులుగా నటిస్తూ, తాము టార్గెట్ చేసుకున్నవారిని ఇళ్లలో బంధించి, వారికి అరెస్టు భయం కల్పించడంతోపాటు, వెంటనే డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. దీంతో అరెస్టు, పరువు నష్టం భయంతో బాధితులు స్కామర్ల ఉచ్చులో సులభంగా పడిపోతారు. దీంతో నిండా మోసపోతుంటారు.ఈ రకమైన మోసానికి గురికాకుండా ఉంటాలంటే విజిలెన్స్ సహకారం అవసరం. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు విజిలెల్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలి. ఇటువంటి సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సంచార్ సాథి వెబ్సైట్లో చక్షు పోర్టల్‌ను ప్రారంభించింది. దీనికి తోడు ఇలాంటి మోసాల బారిన పడినవారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయకూడదు. ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థ ఎవరినీ పిన్, లేదా ఓటీపీని అడగదు. ఇటువంటి సందర్భాల్లో పొరపాటున కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఆన్లైన్ మోసాల నివారణకు సోషల్ మీడియాతోపాటు బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం ఉత్తమమని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
కేజ్రీవాల్ అరెస్టు: ఈడీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తొలిసారి షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్30) విచారించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్‌ను ఈడీ 2022లో అరెస్టు చేసిందని, కేజ్రీవాల్‌ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు.ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనేదానిపై క్లారిటీ లేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని చెప్పారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి మొదట్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, తర్వాతే మాట మార్చారని వాదించారు. -
ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఇరాన్లో భారీ పేలుళ్లు -
సీఎం వైఎస్ జగన్‌పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్‌పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్‌కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్‌ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కేదర్‌యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ ఏ1గా ఉన్నాడు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్ అదిమిపట్టుకున్నారు. బాధను పంటిబిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?
ఎరక్కపోయి అమెరికాలో ఇరుక్కుపోయారు ఇద్దరు అమ్మాయిలు. తెలిసో తెలియకో ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇబ్బందుల్లో పడ్డారు. న్యూజెర్సీలో చదువుకుంటున్న వీరిద్దరు హోబెకన్ ఏరియాలోని షాప్‌రైట్ అనే సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. ఈ మాల్లో కొంతసేపు షాపింగ్ చేసిన వీరిద్దరు బిల్లింగ్ చేసి బయటికొచ్చారు. అయితే వీరు అన్ని వస్తువులకు కాకుండా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించినట్టు పోలీసులు అభియోగం మోపి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీకి సుప్రీం నోటీస్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోగా సమాధానమివ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీన చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలన్న అభిషేక్ సింఘ్వి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన 15 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా వర్చువల్‌గా విచారణ చేపట్టారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో బీఆర్ఎస్ నేత కె.కవిత తదితర నిందితుల కస్టడీ గడువు కూడా అదే రోజుతో ముగుస్తోందని ఆమె తెలిపారు. -
ప్రధాని మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు తెలిపారు. ‘ప్రధాని మోదీపై అసభ్యకరమైన వాఖ్యలు చేసిన అరవింద్ కుమార్ సోని అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతన్ని మస్తురీ పట్టణంలో అదుపులోకి తీసుకున్నాం’ అని బిలాస్పూర్ ఏఎస్పీ(రూరల్ అర్చనా ఝా తెలిపారు. శనివారం భాదోరా గ్రామంలో జరిగిన బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అరవింద్ కుమార్ తీవ్రమైన అసభ్య పదజాలంతో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారని పోలీసులు తెలిపారు. దీంతో బీజేపీ నేత బీపీ సింగ్ అరవింద్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే విధంగా ప్రధానిమోదీపై అరవింద్ అనే వ్యక్తి అస్యభ వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బిలాస్పూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థి దేవేంద్రసింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో ఏప్రిల్ 19 నుంచి మే 7వరకు మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేవేంద్ర సింగ్ యాదవ్ బిలాయ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. బీజేపీ అభ్యర్థి టోకెన్ సాహూకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేవేంద్ర సింగ్‌ను బరిలోకి దించింది. -
Delhi Liquor Scam: సంక్షోభం వేళ ఎంపీల మౌనం!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ పార్టీ ఎంపీలు మాత్రం మౌనవ్రతం పాటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పారీ్టకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో కేవలం ఇద్దరే కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతా వారి వ్యవహారంపై పార్టీ సమావేశంలో చర్చించాలనే డిమాండ్లు అంతర్గతంగా ఊపందుకున్నాయి. ఎనిమిది మంది గాయబ్.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ గత నెల 21న అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ ఢిల్లీసహా పలు రాష్ట్రాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ఇద్దరు ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్‌సింగ్, సందీప్ పాఠక్‌లు మాత్రమే చురుగ్గా ఉంటున్నారు. మిగతా 8 మంది సభ్యులు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. సంజయ్ సింగ్ ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచి్చన మరునాటి నుంచే బీజేపీని, దర్యాప్తు సంస్థల పనితీరును తప్పుపడుతూ ప్రకటనలు చేస్తున్నారు. సందీప్ పాఠక్ సైతం సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో ఆప్ గొంతుక వినిపిస్తున్నారు. పార్టీ కోశాధికారి, ఎంపీ ఎన్డీ గుప్తా అడపాదడపా మాత్రమే నిరసనల కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. పూర్తి స్థాయి కార్యక్రమాలకు మాత్రం ఆయన దూరంగానే ఉంటున్నారు. మీడియా భేటీల్లో, సభల్లో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్న ఎంపీ రాఘవ్ చద్దా ఆచూకీ కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆయన ఢిల్లీలో లేరు. గత నెల మొదటి వారంలో లండన్ వెళ్లి కంటికి చికిత్స చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మార్చి చివరి వారంలోనే ఆయన ఢిల్లీ రావాల్సి ఉన్నా, వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండిపోయారంటున్నారు. మరో కీలక నేత స్వాతి మలివాల్ సైతం అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి కేజ్రీవాల్ అరెస్ట్‌ను సామాజిక వేదికలపై ఖండిస్తున్నారు. ప్రత్యక్ష నిరసల్లో ఇంతవరకూ పాల్గొనలేదు. తన సోదరి అనారోగ్యం దృష్ట్యా అమెరికాలో ఉండాల్సి వస్తోందని, తిరిగి వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పోరాడుతానని అంటున్నారు. పంజాబ్‌కు చెందిన పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య సునీతతో భేటీ అయ్యారు. అది మినహా రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీ, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లోగానీ పాల్గొనలేదు. మరో ఇద్దరు ఎంపీలు అశోక్‌కుమార్ మిట్టల్, క్రికెటర్ హర్బజన్‌సింగ్‌లు కేజ్రీ అరెస్ట్ మినహా ఇతర అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పర్యావరణ వేత అయిన ఎంపీ బల్బీర్‌సింగ్ సీచేవాల్, మరో ఎంపీ విక్రమ్‌జీత్ సింగ్ చాహ్నీలు సైతం తమ వ్యక్తిగత వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇలా..పార్టీ ఎంపీలు మౌనవత్రం దాల్చడంపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో జరిగే కీలక భేటీలో ఎంపీల తీరుపైచర్చిస్తామని సంజయ్ సింగ్ చెప్పారు. -
USA: ‘అతివాదం’తో తలనొప్పులు.. హక్కుల కార్యకర్త అరెస్టు
కాలిఫోర్నియా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చిధ్రమవుతున్న గాజా పరిస్థితి మానవతావాదుల హృదయాలను ద్రవింపజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హక్కుల కార్యకర్తలు పాలస్తీనాకు మద్దతుగా తమ గళం విప్పుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా బేకర్స్ఫీల్డ్ నగర కౌన్సిల్లో హక్కుల కార్యకర్త రిద్ది పటేల్ పాలస్తీనాకు మద్దతుగా గొంతు వినపించారు. అయితే గీత దాటి అతివాదం వైపు వెళ్లి కష్టాలు కొనితెచ్చుకున్నారు. గాజాలో కాల్పుల విరమణ తీర్మానంపై హియరింగ్ సందర్భంగా ఓపిక నశించిన రిద్ది ఏకంగా మేయర్, కౌన్సిల్ సభ్యులనే బెదిరించారు. ‘ఏదో ఒక రోజు మీ ఇంట్లోనే మిమ్మల్ని చంపే పరిస్థితి వస్తుంది’ అని వారిని హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ తీర్మానానికి ఎవరూ మద్దతు పలకకపోవడం..తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుండడంతో నిరాశ నిస్పృహలకు లోనైన రిద్ది పటేల్ తనలోని అతివాది బయటికి తీశారు. కౌన్సిల్ సభ్యులను బెదిరించినందుకుగాను రిద్దిపై 16 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పటేల్ తీరును హిందూ అమెరికన్ ఫౌండేషన్లు ఖండించాయి. బెదిరింపుల సందర్భంగా మహాత్మాగాంధీ పేరతో పాటు చైత్ర నవరాత్రిలను రిద్ది ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎంతటి తీవ్రత కలిగిన అంశంపై పోరాడాల్సిన సందర్భంలోనైనా హక్కుల కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాల్సిందేనని రిద్ది పటేల్ ఎదుర్కొంటున్న పరిణామాలే తెలియజేస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి.. సౌదీ జైలులో భారతీయుడు -
దొరికాడు దొంగ
సాక్షి, అమరావతి: ‘స్కిల్’ స్కామ్... చంద్రబాబుకు ఎప్పటికీ వెంటాడే పీడకల...40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబును ఖైదీ నంబర్ 7691గా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఊచలు లెక్కించేలా చేసింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం. యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ కేసులో సీఐడీ చంద్రబాబుతో పాటు 8 మందిని అరెస్ట్ చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షెల్ కంపెనీల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. చంద్రబాబు 17ఏ చట్టం కింద ఈ కేసు నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే తరహాలో షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు పొందిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి అదే తరహాలో స్కిల్‌స్కామ్‌కు పాల్పడి షెల్‌కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లించిన చంద్రబాబుపై ఈడీ కత్తి వేలాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని నిర్ధారిస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ కమామిషు ఇలా ఉంది... చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ♦ టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ♦ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ♦ పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. 370 కోట్ల నుంచి 3,300 కోట్ల రూపాయలకు పెంచేసి.. 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం తన బినామీ సంస్థ డిజైన్ టెక్‌ను రంగంలోకి దింపి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీకి డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలు తమ వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వనే లేదు. ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు... డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగాతరలించారు. ప్రతిదశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. ఫైళ్లు మాయం చేసిన కుంభకోణం గుట్టు రట్టు 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్ నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదన్న సుప్రీం కోర్టు స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. సెక్షన్ 17ఏను తనకు వర్తింపజేస్తూ తనపై స్కిల్ స్కామ్‌లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం 2017లోనే నమోదు చేసింది కాబట్టి 2018 నవంబరు నుంచి అమలులోకి సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. స్కిల్ స్కామ్ ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86కోట్లు.. చంద్రబాబుపైఈడీ కన్ను మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అక్రమ నిధులు పొందితే అందుకు ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్‌కు కూడా ఇది వర్తిస్తుందని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు మళ్లించినట్టు సీఐడీ ఆధారాలతోసహా నిర్ధారించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీ హిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలు ఉన్నాయి. ఆ మూడు ఖాతాల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 జమ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయినోట్ల కట్ల రూపంలో తీసుకువచ్చి మరీ జమ చేశారు. ఆ నిధులు తమకు ఎలా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును 2016, నవంబరులో ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. భారీ డిపాజిట్లకు ఆదాయ మార్గాలు వెల్లడించాలని పేర్కొంది. కానీ ఆదాయ మార్గాలను వెల్లడించకుండానే టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86కోట్లు జమ చేయడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్కిల్‌స్కామ్‌లో చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీఎండీ–సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్కర్ తదితర కంపెనీల అధికారులు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్‌పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement