ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి

Published Wed, May 1 2024 6:03 AM

Speedy Construction of Bhogapuram Airport: Andhra Pradesh

శరవేగంగా భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మాణం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో మైలురాయి

2025 నాటికి సాకారం చేయాలనేది సంకల్పం

అంతర్జాతీయ విమానాశ్రయం... ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి సూచిక. సంబంధిత రాష్ట్రానికి ఐకానిక్‌ సింబల్‌. దేశ యవనికపై అదొక ప్రత్యేక ముద్ర. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ దిశలో వేసిన అడుగులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. 2025 నాటికి తొలి దశ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది.

 గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూసేకరణకు బీజం పడింది. కానీ అప్పటి ప్రభుత్వం అభూత కల్పనలు, భయాలు కలి్పంచి ఏకంగా 15 వేల ఎకరాలు అవసరమని ప్రచారం చేయించింది. రైతుల ఆందోళనలతో ఐదు వేల ఎకరాలకు దిగింది. ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. మరోవైపు భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. 

న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. దీన్ని తానే నిర్మించానని చెప్పుకోవాలనే తహతహతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందు ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా టీడీపీ ముఖ్య నాయకుడు, కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ చిత్తశుద్ధి తేటతెల్లమైంది. మంత్రిగా ఉండి కూడా భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన అనుమతులనూ తీసుకురాలేకపోయారన్నది చర్చనీయాంశమైంది.     –సాక్షి ప్రతినిధి, విజయనగరం

ప్రభుత్వం మారింది.. దశ తిరిగింది
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచి్చంది. అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారు. డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేశారు. 

దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వా«దీనంలోనున్న డీ పట్టా (అసైన్డ్‌) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.

 విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. మిగతా భూమిని ఐటీ సిటీ కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్‌ ఆకారంలో ఫ్‌లైవోవర్‌ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తి అయ్యింది. 

రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వా«దీనంలోనున్న డీ పట్టా (అసైన్డ్‌) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. మిగతా భూమిని ఐటీ సిటీ కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్‌ ఆకారంలో ఫ్‌లైవోవర్‌ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తి అయ్యింది.  

విమానాశ్రయ స్వరూపం
స్థాయి    :    అంతర్జాతీయ విమానాశ్రయం 
మొత్తం స్థలం    :    2,750.78 ఎకరాలు  
ప్రభుత్వ భూమి    :    422.69 ఎకరాలు  
కొనుగోలు చేసిన భూమి    :    1,383.39 ఎకరాలు 
విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించింది    :    2,203 ఎకరాలు  
రన్‌వే పొడవు    :    3.8 కిలోమీటర్లు  
నిర్వాసిత కుటుంబాలు    :    376  
నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణ వ్యయం    :    రూ.80 కోట్లు 
కేటాయించిన స్థలం    :    25 ఎకరాలు 
ప్రత్యేకంగా విద్యుత్తు సబ్‌స్టేషన్‌ కోసం    :    5.47 ఎకరాలు 
మొత్తం ఖర్చు    :    రూ.5వేల కోట్లు (అంచనా)

చంద్రబాబు హయాం
15 వేల ఎకరాలు అవసరమన్న ప్రచారం.  
∗ రైతుల ఆందోళనతో ఐదు వేల ఎకరాలకు ప్రభుత్వం దిగొచి్చంది.  
∗ భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్‌ విడుదల 
∗ పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటన.  
∗ అయినా కొలిక్కిరాని భూసేకరణ. 
∗ నిర్వాసితులకు ఏం చేయబోతోందో చెప్పనే లేదు. 
∗ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో రైతుల పిటిషన్‌. 
∗ దాని సంగతి ఎటూ తేలలేదు. 
∗ ఎన్నికలు సమీపించడంతో అంతా తానే చేశానని చెప్పుకోడానికి 2019శ్రీ ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టారు.  

జగన్‌ పాలనలో
∗ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  
∗  విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించింది 
∗  2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది.  
∗  కేసులు వేసిన రైతుల డిమాండ్లనుపరిష్కరించింది.  
∗ రెట్టింపు పరిహారం ఇచి్చంది.  
∗ నిర్వాసితులకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్‌íÙప్‌ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలను నిర్మించింది. 
∗ దాదాపు రూ.5 వేల కోట్లతో జీఎంఆర్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  
∗  2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనేది లక్ష్యం.

ఆర్థికాభివృద్ధికి ఊతం  
విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుంది. ఫుడ్, ఫార్మా, ఫిషరీ రంగాల ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు స్థావరంగా నిలుస్తుంది. ట్రావెల్, హాస్పిటాలిటీ, గోడౌన్, వేర్‌ హౌసింగ్‌ రంగాలు అభివృద్ధి చెందుతాయి. 6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు సేవలు లేకపోవడం వల్లే విశాఖ పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగం పుంజుకోవడం లేదు.  –కాపుగంటి ప్రకాశ్, పెసిడెంట్,  చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, విజయనగరం

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం 
సీఎం జగన్‌ అధికారంలోకి వచి్చన తరువాత రైతులకు పూర్తి స్థాయి లో పరిహారం చెల్లించి, నిర్వాసితులకు గూడెపువలస, లింగాలవలస గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను ఏర్పాటు చేసింది. ఉద్యమ సమయంలో గత ప్రభుత్వం మాపై పెట్టిన కేసులను ఎత్తివేసింది. విమానాశ్రయ నిర్మాణంలో భూ ములు కోల్పోయిన రైతులు, గృహా లు కోల్పోయిన నిర్వాసితులందరం సీఎం జగన్‌కి రుణపడి ఉంటాం. – కొండపు ఎల్లయ్యమ్మ, నిర్వాసితురాలు, కవులవాడ సర్పంచ్‌

శరవేగంగా నిర్మాణ పనులు... 
భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్‌వే పటిష్టంగా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం సగటున 10 అడుగుల ఎత్తున మట్టితో భూమి చదును చేస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు కోల్పోయిన 376 కుటుంబాల కోసం రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను ప్రభుత్వం నిరి్మంచింది. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా ఐదు సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. 

నిర్వాసిత గ్రామాల నుంచి గతంలో వలసపోయిన కుటుంబాలకూ మానవతా దృక్పథంతో ఇంటిస్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారిని ఆనుకొని 25 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది. విమానాశ్రయ అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా క్వార్టర్లను జీఎంఆర్‌ సంస్థ నిరి్మంచనుంది. ఇందుకోసం ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది.  ప్రత్యేకంగా విద్యుత్తు సబ్‌స్టేషన్‌ కోసం భోగాపురం మండలంలోని ముక్కాం రెవెన్యూ పంచాయతీ పరిధిలో 5.47 ఎకరాల భూమిని కేటాయించింది.

Advertisement
Advertisement