ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం? | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం?

Published Sat, Apr 20 2024 1:30 AM

మిషన్‌ భగీరథ నీటి ట్యాంకు సమీపంలో భూమిని చదును చేసిన గుర్తు తెలియని వ్యక్తులు - Sakshi

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూమి కొరత ఏర్పడింది. మరోవైపు ఉన్న కాస్త సర్కారు భూమి కబ్జాకు గురవుతోంది. మంచిర్యాలలో డంపింగ్‌యార్డు, ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల భవన నిర్మాణాలకు భూమి లేక పక్క మండలాల్లో నిర్మించాల్సి వస్తోంది. ఎన్నికల వేళ అధికారులు బిజీగా ఉండడంతో అక్కడక్కడ మిగిలి ఉన్న కొంత ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. మంచిర్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు రంగంపేట్‌ ఆండాళమ్మ కాలనీలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు కొందరు ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టారు. డంపింగ్‌ యార్డు సమీపంలో ఉన్న మిషన్‌ భగీరథ నీటి ట్యాంకును నిర్మించిన చోటు సమీపంలో ఎకరానికి పైగా ప్రభుత్వ భూమిని చదును చేశారు. స్థానికుల అభ్యంతరంతో ప్రస్తుతం కార్యకలాపాలు నిలిచినా.. తెరవెనుక దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెనుక భాగంలోనూ ఉన్న ప్రభుత్వ భూమిలో షెడ్లు వేసుకునేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించారు. ఆండాళమ్మ కాలనీలో ఇళ్ల కోసం కేటాయించిన భూమి కాకుండా మిగిలిన ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు.

విలువైన భూమి కావడంతోనే..

మంచిర్యాల మున్సిపాలిటీలోని రంగంపేట్‌, ఆండాళమ్మ కాలనీలోని సర్వే నంబర్‌ 131లో 38.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలోనే ప్రభుత్వం 20 ఎకరాల్లో ఆండాళమ్మ కాలనీ ఏర్పాటు చేసి పేదలకు ప్లాట్లుగా అప్పగించింది. 5 ఎకరాల భూ మి దర్గా కోసం, 8 గుంటలను ఏసీసీ పైపులైన్‌కు, మరో 2 గుంటలు ముస్లింల చిల్లా నిర్మాణానికి అ ప్పగించారు. 1.25 ఎకరాలు, 25 గుంటల భూమి పేదలకు అసైన్‌ చేశారు. మిగిలిన భూమి కబ్జాకు కొన్నేళ్లుగా పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆండాళమ్మ కాలనీ గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు కొందరు ప్రయత్నించగా కాలనీవాసులు కలెక్టర్‌కు 2021లోనే ఫిర్యాదు చేశారు. దీంతో రెవె న్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిగా తే ల్చగా, కాలనీవాసులకు, కబ్జాలో ఉన్న వారికి మ ధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతోంది. కొందరు కాలనీకి చెందిన వారిని మచ్చిక చేసుకున్న తరువాతనే ప్రభుత్వ భూమిలో ఇటీవల ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 8వ వా ర్డులోనే పాతమంచిర్యాల సాయిబాబ గుడిని ఆనుకుని ఉన్న రహదారి కోసం కేటాయించిన భూమి కబ్జాకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా రు. దీనిని ఆనుకుని ఉన్న పలు వెంచర్ల యజమానులు 40 అడుగుల వెడల్పు బాటను కొద్దికొద్దిగా కబ్జా చేసి, వారి వెంచర్లలో కలుపుకునే యత్నాలు చేస్తున్నారు. పాతమంచి ర్యాల, ఆండాళమ్మ కాలనీలో ప్రస్తు తం కబ్జాకు ప్రయత్నించే భూముల విలువ దాదాపు రూ.5 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని రక్షించేలా రెవెన్యూ అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మంచిర్యాల తహసీల్దార్‌ రమేశ్‌ను సంప్రదించగా.. 131 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని పరిశీలించి, అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

భూమిని చదును చేసిన వైనం

దారినీ వదలని రియల్‌ వ్యాపారులు

Advertisement
Advertisement