ఓటే.. నీ ఆయుధం..! | Sakshi
Sakshi News home page

ఓటే.. నీ ఆయుధం..!

Published Sat, Apr 20 2024 1:15 AM

- - Sakshi

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వినియోగం ప్రక్రియ అత్యంత బృహత్తరమైనది. ఈ ప్రక్రియని విజయవంతం చేయడంలో యువతని భాగస్వాములుగా మేల్కొలిపేందుకు ఎన్నికల సంఘం అంకితభావంతో కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) మార్గదర్శకంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలో పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలాసోర్‌ జిల్లాలోని వివిధ కళాశాలల్లో విద్యార్థులు ఈ కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకున్నారు. ప్రధానంగా తొలిసారి ఓటుహక్కు పొందిన సరికొత్త విద్యార్థి ఓటర్లు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఓటుహక్కు ప్రాధాన్యత ఇతివృత్తంగా బాలాసోర్‌ ప్రాంతంలో పలు పాఠశాలలు, కళాశాలల్లో ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. మొదటిసారి ఓటు వేయనున్న యువతలో ఓటుహక్కు సద్వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మన ప్రజాస్వామ్యం భవిష్యత్తును రూపొందించడంలో మన యువతను శక్తివంతం చేయడం చాలా కీలకం అని ఎన్నికల సంఘం తెలిపింది. డీఈవో బాలాసోర్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా ఓటు వేయనున్న విద్యార్థులను అవగాహన కల్పించే దృక్పథంతో రంగోలీ పోటీలు నిర్వహించారు. వీరు రూపుదిద్దిన ప్రతి రంగవల్లి భారత ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను ప్రతిబింబించిందని నిర్వాహక వర్గం అభినందించింది.

– భువనేశ్వర్‌

1/4

రంగవళ్లుల పోటీలో పాల్గొన్న విద్యార్థినులు
2/4

రంగవళ్లుల పోటీలో పాల్గొన్న విద్యార్థినులు

ఓటు నవ భారత నిర్మాణానికి నాంది రంగవల్లి
3/4

ఓటు నవ భారత నిర్మాణానికి నాంది రంగవల్లి

దేశ నిర్మాణంలో ఓటుహక్కు బలమైన 
అవకాశం నినాదంతో రంగవల్లి
4/4

దేశ నిర్మాణంలో ఓటుహక్కు బలమైన అవకాశం నినాదంతో రంగవల్లి

Advertisement
Advertisement