అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Published Fri, Apr 19 2024 1:30 AM

నిషాడిజైన్స్‌ ఫ్యాక్టరీలో ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది  - Sakshi

పుట్టపర్తి టౌన్‌: అగ్ని విపత్తుల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్ని మాపక అధికారి నాగరాజునాయక్‌ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాల్లో భాగంగా గురువారం గుంతపల్లి వద్దున్న నిషా డిజైన్స్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు అవగాహన కలిగించారు. డీఎఫ్‌ఓ నాగరాజునాయక్‌ మాట్లాడుతూ మీరు పనిచేస్తున్న ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అవగాహణ కలిగి ఉండాలన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పు ఎలా కాపాడుకోవాలో డెమో ద్వారా వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫైర్‌ సిబ్బంది విజయకుమార్‌, నరసింహులు, రామాంజనేయులు, దేవలానాయక్‌, వెంకటరెడ్డి రామాంజనేయులు, దామోదర్‌, తేజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ నాయుడు పాల్గొన్నారు.

సజావుగా ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రీ పీహెచ్‌డీ గురువారం ప్రారంభమయ్యాయి. ఎస్కేయూ క్యాంపస్‌లోని పరీక్ష కేంద్రాలను వీసీ డాక్టర్‌ కె.హుస్సేన్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎంవీ లక్ష్మయ్య పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల్లోని వసతులను ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎ.కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

యువజన విభాగం ‘పురం’ అధ్యక్షుడిగా సల్మాన్‌ఖాన్‌

పుట్టపర్తి అర్బన్‌: వైఎస్సార్‌సీపీ అనుబంధ యువజన విభాగం హిందూపురం నియోజకవర్గ అధ్యక్షునిగా సల్మాన్‌ఖాన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్‌నిశ్చల్‌ నియామక పత్రం అందజేశారు. తన మీద నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు సల్మాన్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసి వైఎస్సార్‌సీపీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు.

1/1

Advertisement
Advertisement