10 స్థానాల్లో గెలుపు ఖాయం | Sakshi
Sakshi News home page

10 స్థానాల్లో గెలుపు ఖాయం

Published Sat, Apr 20 2024 1:40 AM

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి  - Sakshi

అర్వపల్లి: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో పది ఎంపీ స్థానాల్లో గెలుపు ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం అర్వపల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు అర్వపల్లి దేవాలయంలో పూజలు చేశారు. దేవాలయం నుంచి మెయిన్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో తిరిగే కాంగ్రెస్‌ నాయకులను హామీలపై నిలదీయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందని సాగు, తాగు నీటి కోసం రైతులు, ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్నారు. బీసీలు, ఎస్సీలకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిగా మారిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గోదావరి జలాలు రాకుండా పోయాయన్నారు. ఈసారి ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తీసుకువస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌ మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా.. జగదీష్‌రెడ్డి, క్యామ మల్లేష్‌, కిశోర్‌లను జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ గజమాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బడుగుల లింగయ్యయాదవ్‌, సూర్యాపేట, భువనగిరి జెడ్పీ చైర్మన్‌లు గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్‌గౌడ్‌, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట జెడ్పీటీసీలు దావుల వీరప్రసాద్‌యాదవ్‌, జీడి భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, బైరబోయిన రామలింగయ్య, బొడ్డు రామలింగయ్య, మొరిశెట్టి ఉపేందర్‌, కనుకు శ్రీనివాస్‌, గోసుల విజయ్‌, వల్లపు గంగయ్య, కడారి నరేష్‌, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement