జీ మీడియాకు పునీత్‌ గోయెంకా రాజీనామా | Sakshi
Sakshi News home page

జీ మీడియాకు పునీత్‌ గోయెంకా రాజీనామా

Published Wed, Jul 22 2020 7:22 PM

 Punit Goenka resigns from Zee Media - Sakshi

సాక్షి, ముంబై: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) సీఎండీ పునిత్ గోయెంకా జీ మీడియా నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ డైరెక్టర్ పదవికి  గోయెంకా రాజీనామా చేశారని, తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని  జీ మీడియా ఎక్స్ఛేంజ్ సమాచారంలో బుధవారం తెలిపింది.  2010 జనవరి నుంచి జీల్‌ ఎండీ గా ఉన్న గోయెంకా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర పెద్ద కుమారుడు. గోయెంకా జనవరి 1, 2010 నుండి జీ ఎంటర్‌టైన్‌మెట్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

మరోవైపు  జీ మీడియా కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 11.14 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ 86.66 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం 18.42 శాతం తగ్గి 138.15 కోట్ల రూపాయలకు చేరుకుంది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 169.35 కోట్లుగా ఉంది. మల్టీ బిలియన్ డాలర్ల ఎస్సెల్ గ్రూపులో జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో జీ న్యూస్ లిమిటెడ్) ఒకభాగం. 

Advertisement
 
Advertisement
 
Advertisement