దూకుడు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా | Sakshi
Sakshi News home page

దూకుడు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా

Published Mon, Sep 5 2016 10:41 AM

దూకుడు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా - Sakshi

ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా తన దూకుడును కొనసాగిస్తోంది. మరో మూడు బాలిస్టిక్ క్షిపణులను మంగళవారం ఉత్తర కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మీడియా సంస్థ యొన్‌హప్ వెల్లడించింది. వాంగ్జు కౌంటీ నుంచి తూర్పు సముద్రం(సీ ఆఫ్ జపాన్)  వైపు ఈ క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా నిర్వహించినట్లు యొన్‌హప్ తెలిపింది. హైడ్రోజన్ బాంబ్ ప్రయోగాన్ని నిర్వహించిన ఉత్తర కొరయా బాలిస్టిక్ క్షిపణుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది.

రెండు వారాల క్రితం ఓ సబ్ మెరైన్ నుంచి ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి జపాన్ సముద్రజలాల్లో పడటంతో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా ఉత్తర కొరియా పరీక్షలు జరిపిన తీరును జపాన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement