పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్‌ | Sakshi
Sakshi News home page

పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్‌

Published Tue, Sep 12 2023 2:12 PM

ICICI Bank Deputy Manager Fraud Rs 8 5 Crore - Sakshi

ఆధునిక కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మనకు సంబంధం లేకుండానే మనపేరు మీద లోన్ తీసుకోవడం వంటి సంఘటనలు గత కొంత కాలంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం పాన్‌, ఆధార్‌ జిరాక్స్‌ కాపీల కోసం జిరాక్స్‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెల్తూ ఉంటాము. అలాంటప్పుడు మన కాపీలను కొంతమంది వినియోగించి ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు.

నిజానికి మనకు సంబంధం లేకపోయినా కొన్ని సందర్భాల్లో మెసేజ్‌లు లేదా మెయిల్స్ వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని సరిగ్గా పట్టించుకోకుంటే మోసపోయినట్లు చివరి వరకు కూడా తెలిసే అవకాశం లేదు. ఇలాంటి ఉదండమే తాజాగా వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో భారీ మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 8.5కోట్ల రూపాయల విలువ చేసే బంగారం విషయంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు సంబంధించిన నిల్వల్లో తేడాలున్నట్లు ఆడిట్‌లో తెలిసింది. దీనిపైన బ్యాంకు డిప్యూటీ మేనేజర్ 'బైరిశెట్టి కార్తీక్'పై అధికారులు ఫిర్యాదు చేశారు.

పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ను వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 5 పద్ధతుల్లో 128 ఖాతాదారులపేరిట గోల్డ్ లోన్ పొందినట్లు రికార్డులు తయారు చేసి బ్యాంకును మోసం చేసినట్లు, వచ్చిన డబ్బును ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్​లో పెట్టి పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement