ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు సిమ్‌కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులే ఉండాలి.
ప్రభుత్వ వెబ్‌సైట్ సంచార్‌సాతి వెబ్‌సైట్ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్‌కార్డులను నేరుగా ఆన్‌లైన్‌లోనే బ్లాక్ చేసుకునే సౌకర్యం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.
బ్రౌజర్‌లో https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
కింద సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కేటగిరీలో ‘Know Your Mobile Connections’ క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్‌సీఓపీ) అందిస్తోంది.
‘Know Your Mobile Connections’పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌నంబర్‌ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. ‘వాలిడేట్ క్యాప్చా’ బటన్ ప్రెస్ చేయాలి.
పైన ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్‌లో ఎంటర్‌చేసి లాగిన్ అవ్వాలి. మన పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది.
ఇదీ చదవండి: రోజులో ఒకసారైనా ఓపెన్ చేసే ఈ యాప్ గురించి తెలుసా..?
ఒకవేళ ఏదేని నంబర్‌ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా లాగ్‌అవుట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment