Sakshi News home page

కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు

Published Fri, Mar 15 2024 4:39 AM

Sensex Jumps 335 Points, Nifty Above 22,100, IT Stocks Lead - Sakshi

చిన్న, మధ్య స్థాయి షేర్లలో రికవరీ 

రాణించిన ఐటీ, ఇంధన రంగ షేర్లు

మెప్పించిన ద్రవ్యోల్బణ డేటా 

మళ్లీ 73 వేలపైకి సెన్సెక్స్‌

ముంబై: వాల్యూయేషన్‌ ఆందోళనలను విస్మరిస్తూ ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య స్థాయి షేర్లను కొనేందుకు ఆసక్తి చూపడంతో స్టాక్‌ సూచీ లు గురువారం లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 335 పాయింట్లు పెరిగి 73 వేల స్థాయి పైన 73,097 వద్ద నిలిచింది. నిఫ్టీ 149 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,146 వద్ద ముగిసింది. సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి.

హోల్‌ సేల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4 నెలల కనిష్టానికి దిగివచి్చనట్లు డేటా వెల్లడి కావడంతో బుధవారం ట్రేడింగ్‌లో పతనమైన షేర్లకు దిగువ స్థాయి లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. ఒక దశలో సె న్సెక్స్‌ 602 పాయింట్లు పెరిగి 73,364 వద్ద, నిఫ్టీ 207 పాయింట్లు బలపడి 22,205 వద్ద గరి ష్టాలను అందుకున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఫై నాన్స్‌ షేర్లు మాత్రమే నష్టపోయాయి. అంతర్జాతీ య ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవు తున్నాయి.  

► కనిష్ట స్థాయిల్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 3.11%, మిడ్‌ క్యాప్‌ ఇండెక్సు 2.28% చొప్పున రాణించాయి. రంగాల వారీగా సరీ్వసెస్, టెలికం సూచీలు 4%, యుటిలిటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, పారిశ్రామిక ఇండెక్స్‌లు 3%, కమోడిటీ సూచీ 2.50% చొప్పున లాభపడ్డాయి.  
► భారత సైన్యం, తీర రక్షక దళం కోసం 34 తేలికపాటి హెలికాప్ట్టర్లు, అనుబంధ పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖతో రూ.8,073 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ కంపెనీ షేరు 4.2% లాభపడి రూ.3,167 వద్ద స్థిరపడింది.  
► సెన్సెక్స్‌ 335 పాయింట్లు పెరగడంతో బీఎస్‌ఈలో రూ.7.81 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపద బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది.  
► అదానీ గ్రూప్‌ షేర్లూ ముందడుగేశాయి. ఆదానీ టోటల్‌ గ్యాస్, అదానీ గ్రీన్‌ సొల్యూషన్స్‌ 11%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 10%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 6%, అదానీ పోర్ట్స్, ఎన్‌డీటీవీ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లు 4%, అదానీ పవర్‌ 2% రాణించాయి. గ్రూప్‌లో కంపెనీల మార్కెట్‌ క్యాపిటలేషన్‌ రూ.15.66 లక్షల కోట్లు పెరిగింది. 
 

గోపాల్‌ స్నాక్స్‌ లిస్టింగ్‌ మెప్పించలేదు. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.401)తో పోలిస్తే 13% డిస్కౌంట్‌తో రూ.350 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనైంది. దాదాపు 15% క్షీణించి రూ.342 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.342 వద్ద ముగిసింది.

Advertisement

What’s your opinion

Advertisement