స్థిరంగా బంగారం, వెండి.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే? | Sakshi
Sakshi News home page

స్థిరంగా బంగారం, వెండి.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

Published Sun, Apr 28 2024 2:31 PM

Today Gold and Silver Price 28 April 2024

ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 200 నుంచి రూ. 200 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.200, రూ.220 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.

దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72760 రూపాయల వద్ద ఉంది.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా ఈ రోజు ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 28) ఒక కేజీ వెండి ధర 84000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

Advertisement
Advertisement