అదరగొట్టిన ఎస్‌బీఐ: లాభాలు హై జంప్‌ | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ఎస్‌బీఐ: లాభాలు హై జంప్‌

Published Fri, Aug 4 2023 4:51 PM

State Bank of India Q1 results Here are the details - Sakshi

State Bank of India Q1 results: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. శుక్రవారం  ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాలలో అంచనాలకు మించి రాణించింది. అంతేకాదు  వరుసగా నాలుగో త్రైమాసికంలో రికార్డు లాభాలను నమోదు చేయడం విశేషం.ఆస్తుల నాణ్యత మెరుగుదల  నికర వడ్డీ ఆదాయం వృద్ధి, లాభాలకు దారి తీసింది. (యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌...ఇక పండగే!)

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.16,884.29 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లోని  రూ.6,068.08 కోట్ల లాభాలతో పోలిస్తే ఇది ఏకంగా 178.24 శాతం అధికం. మార్కెట్ విశ్లేషకులు అంచనా  12.-160 శాతం కంటే ఎక్కువ.  నికర వడ్డీ ఆదాయం 24.71 శాతం ఎగిసి రూ.38,905 కోట్లుగా నమోదైంది. 

డిపాజిట్లు, ఇతర హైలైట్స్‌
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం డిపాజిట్లు ఏడాదికి 12 శాతం పెరిగి రూ.45.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.40.46 లక్షల కోట్లుగా ఉంది. విదేశీ కార్యాలయాల డిపాజిట్లు ఏడాదికి 22.74 శాతం పెరిగి రూ.1.79 లక్షల కోట్లకు చేరుకోగా, దేశీయ డిపాజిట్లు 11.60 శాతం పెరిగి రూ.43.52 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

CASA డిపాజిట్ సంవత్సరానికి 5.57 శాతం పెరిగింది. అయితే CASA నిష్పత్తి జూన్ 30 నాటికి 42.88 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జిన్లు గత ఏడాది త్రైమాసికంలో 3.23 శాతం నుంచి జూన్ త్రైమాసికంలో 24 బేసిస్ పాయింట్లు పెరిగి 3.47 శాతానికి  ఎగిసింది.  స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.76 శాతంగా ఉంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకు ఈ త్రైమాసికానికి రూ.2,501.31 కోట్ల విలువైన కేటాయింపులు చేసింది.

జూన్ 30, 2022 నాటికి రూ.29,00,636 కోట్లతో పోలిస్తే స్థూల అడ్వాన్సులు 13.90 శాతం పెరిగి రూ.33,03,731 కోట్లకు చేరాయని బ్యాంక్ నివేదించింది. అలాగే డిపాజిట్లు రూ.45,31,237 కోట్ల నుంచి రూ.45,31,237 కోట్లకు పెరిగాయి. క్రెడిట్ ఖర్చు 0.32 శాతం ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో 0.61 శాతంగా నమోదైంది.

Advertisement
Advertisement