Update Your Aadhaar Details Free Of Cost Till June 14 - Sakshi
Sakshi News home page

ఆధార్‌ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోండి.. రేపే లాస్ట్‌ డేట్‌!

Published Tue, Jun 13 2023 8:29 PM

Update Your Aadhaar Details Free Of Cost Till June 14 - Sakshi

ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా ఆధార్ కార్డ్‌లోని వివరాల్ని అప్‌డేట్‌ చేసుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (uidai) ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. యూఐడీఏఐ ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘మై ఆధార్‌’ను సందర్శించాల్సి ఉంటుంది. 

యూఐడీఏఐ ట్వీట్‌ మేరకు.. ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ చేసుకొని పదేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలైందా? అయితే మార్చి 15 నుంచి జూన్‌ 14, 2023 వరకు ఉచితంగా https://myaadhaar.uidai.gov.inలో ఐడెంటిటీ ఫ్రూఫ్‌, అడ్రస్‌ ఫ్రూఫ్‌ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాలని ట్వీట్‌ చేసింది. దీంతో యూఐడీఏఐ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. గడువు అనంతరం యధావిధిగా డబ్బులు చెల్లించి ఆధార్‌ను ఆప్‌డేట్‌ చేసుకోవచ్చు. 

అడ్రస్‌ ఫ్రూప్‌ను అప్‌డేట్‌ చేసుకోండిలా

స్టెప్‌1 : https://myaadhaar.uidai.gov.inను విజిట్‌ చేయండి

స్టెప్‌2 : అందులో లాగిన్‌ అయిన తర్వాత ‘నేమ్‌/జెండర్‌/డేట్‌ ఆఫ్‌ బర్త్‌& ఆధార్‌ అడ్రస్‌’

స్టెప్‌3 : అనంతరం అప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి

స్టెప్‌4 : అడ్రస్‌ను సెలక్ట్‌ చేసుకొని మీ ఇంటిపేరు, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఇలా (డెమోగ్రాఫిక్స్‌ ఆప్షన్‌) వివరాల్ని పొందుపరచాలి. అనంతరం ప్రొసీడ్‌ టూ అప్‌డేట్‌ ఆధార్‌పై క్లిక్‌ చేయాలి. 

స్టెప్‌5 : డెమో గ్రాఫిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ వివరాల్ని ఇవ్వాలి. అనంతరం కావాల్సిన కాపీలను స్కాన్‌ చేయాలి. 

స్టెప్‌6 : కాపీలను స్కాన్‌ చేసి సర్వీస్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ (ఎస్‌ఆర్‌ఎన్‌) జనరేట్‌ అవుతుంది. సేవ్‌ చేస్తే మీ ఆధార్‌ అప్‌డేట్‌ స్టేటస్‌ ట్రాక్‌ చేసుకునే వీలు కలుగుతుంది. 

ఇదీ చదవండి :  ‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్‌ మూసివేత!

Advertisement
Advertisement