Sakshi News home page

WhatsApp Chat Filters: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

Published Wed, Apr 17 2024 10:32 PM

WhatsApp Launches New Chat Filters Feature - Sakshi

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్‌లో వాట్సప్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి.

తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

ఇదే ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్‌లో యాక్టివ్‌గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement