హీరోయిన్ నయనతార.. తన 'అన్నపూరణి' సినిమా వివాదంలో చిక్కుకోవడంపై మరోసారి నోరు విప్పింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకుంది. కానీ కంటెంట్ విషయంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. మరీ ముఖ్యంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని కామెంట్స్ రావడంతో నెట్‌ఫ్లిక్స్.. ఈ చిత్రాన్ని పూర్తిగా ఓటీటీ నుంచే తీసేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)
భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నయన్.. మరోవైపు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. గతేడాది రిలీజైన 'అన్నపూరణి' మూవీ ఫ్లాఫ్ కావడం, వివాదాల్లో ఇరుక్కోవడం నయనతార జీర్ణించుకోలేకపోయింది. ఇప్పటివరకు ఈ మూవీ వివాదంపై నోరు మెదపని ఈమె.. ఇటీవల ఒక వేదికపై స్పందించింది. సమాజంలోని అసమానతలను అధిగమించి సక్సెస్ అయ్యే కథా పాత్రల్లో నటించడం, మనఃస్ఫూర్తిగా ఎంపిక చేసుకోవడం తన బాధ్యత అని చెప్పింది. అలానే మహిళల గొంతుగా ప్రతిబింబించాలని తాను అనుకుంటున్నట్లు పేర్కొంది.
నిజానికి నయనతార జీవితం చాలామంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఎన్నో ఆటంకాలను, ఇబ్బందుల్ని అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరుకుంది. 40కి దగ్గరవుతున్నప్పటికీ హీరోయిన్‌గా హిట్లు కొడుతోంది. ప్రస్తుతం తమిళంలో మన్నాంగట్టి సిన్స్ 1960, టెస్ట్ సినిమాల్లో నటిస్తోంది. 'జవాన్' లాంటి హిట్ తర్వాత హిందీలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment