Sakshi News home page

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్‌! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో..

Published Wed, May 17 2023 6:46 PM

zomato upi  - Sakshi

Zomato UPI: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ సంస్థలకు షాక్‌ ఇస్తూ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా సొంతంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి పేమెంట్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పడు ఇలా కాకుండా జొమాటోనే సొంతంగా యూపీఐ సర్వీస్‌ను తీసుకువచ్చింది.

ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు!

కస్టమర్లు చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ యాప్స్‌ పై ఆధారపడకుండా జొమాటో ఈ కొత్త సర్వీసును తీసుకువచ్చింది. దీని వల్ల కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగుతుంది. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు పేమెంట్ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్‌ ని ఓపెన్ చేయాల్సిన పని ఉండదు.

నేరుగా జొమాటో యూపీఐ ద్వారానే కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్ నుంచి సులువుగా డబ్బులు చెల్లించొచ్చు.  జొమాటో కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యంతో ఈ కొత్త యూపీఐ సర్వీస్ ని తీసుకువచ్చింది. జొమాటో యూజర్లు యూపీఐ సేవలని ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

పైలట్‌ ప్రాజెక్ట్‌
ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద జొమాటో ఈ యూపీఐ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అందువల్ల ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.  త్వరలో ఈ యూపీఐ సర్వీస్ అందరికీ అందుబాటులోకి రానుంది.

ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!

Advertisement
Advertisement