పెద్దల ముందే నరికి చంపాడు.. | Sakshi
Sakshi News home page

పెద్దల ముందే నరికి చంపాడు..

Published Mon, Jun 12 2023 1:18 AM

Vadina was brutally murdered for property - Sakshi

ఎల్కతుర్తి: తోడబుట్టిన అన్న ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఆస్తిని వదిన తీసుకుంటే తనకు ఏమీ దక్కదని కక్ష పెంచుకున్న మరిది.. పంచాయితీ పెద్దమనుషుల సమక్షంలోనే ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సీఐ ప్రవీణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. ముల్కనూర్‌కు చెందిన పురాణం స్వరూప (35) భర్త జంపయ్య గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  

ఆస్తి విషయంలో భర్త తమ్ముడు సమ్మయ్యతో గొడువలు జరుగుతున్నాయి. ఆస్తిలో వాటాల విషయమై మాట్లాడటానికి స్వరూప తన తమ్ముడు మౌటం గురువయ్య, అతడి భార్య తిరుపతమ్మతో కలసి ఆదివారం పెద్దమనుషుల సమక్షంలో కూర్చుని మరిది సమ్మయ్యను పిలిపించింది. ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే సమ్మయ్య వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో వదిన స్వరూపపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

పెద్దమనుషులు ఆపే ప్రయత్నంచేసినా వినకుండా స్వరూప మెడ, ఇతర శరీర భాగాలపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement