
టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూయర్క్ వేదికగా టీమిండియాతో వార్మాప్ మ్యాచ్‌లో స్టార్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో ఇస్లాం చేతి వేలికి గాయమైంది. దీంతో షోరిఫుల్ నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు.
అయితే వెంటనే అతడిని అస్పత్రికి తీసుకెళ్లగా ఎడమి చేతివేలికి ఆరు కుట్లు పడ్డాయి. అతడికి దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డల్లాస్ వేదికగా జూన్ 7న శ్రీలంకతో జరిగే తమ తొలి మ్యాచ్‌కు షోరిఫుల్ ఇస్లాం దూరం కానున్నట్లు సమాచారం.
ఒకవేళ అనుకున్న సమయంలో షోరిఫుల్ కోల్పోకపోతే టోర్నీ మొత్తానికి దూరమయ్యే ఛాన్స్ ఉంది. అతడు గాయం నుంచి కోలుకోకపోతే స్టాండ్‌బైలో ఉన్న హసన్ మహ్మద్‌తో బంగ్లా మెనెజ్‌మెంట్ భర్తీ చేసే అవకాశం ఉంది. కాగా భారత్‌తో వార్మాప్ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇస్లాం.. 26 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా రియాద్, జాకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షక్ మహేదీ హసన్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.
ట్రావెలింగ్ రిజర్వ్: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.
Comments
Please login to add a commentAdd a comment