బాబూజీ నా రోల్‌మోడల్‌! | Sakshi
Sakshi News home page

బాబూజీ నా రోల్‌మోడల్‌!

Published Sun, Jul 2 2023 4:41 AM

Sakshi Guest Column By Sushil Kumar Shinde

జవహర్‌లాల్‌ దర్డా (1923–1997) లేదా ‘బాబూజీ’ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు కానీ... ఆయన ఆలోచనలు నిత్యం మన వెంటే ఉంటాయి. రాజకీయాల్లో అత్యంత మేధతో ఆయన పనిచేశారు. జీవితాంతం మహాత్మాగాంధీ ఆలోచనలతోనే గడిపారు. ఆ కాలంలో ఇంకా చాలామంది నేతలు చురుకుగానే వ్యవహరించారు కానీ... బాబూజీ మాత్రం మహారాష్ట్రలో అజాతశత్రువుగా ఉండిపోయారు. మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. మహారాష్ట్ర రాష్ట్రంలో వార్తా పత్రికల ద్వారా సామాజిక సేవ చేయాలన్స్నది బాబూజీ ఎంచుకున్స్న మార్గం!

అచార్య వినోభా భావేను కలిసేందుకు నేను ఒకానొక సందర్భంలో విదర్భ వెళ్లాను. ఆ పర్యటన నాకు బాగా గుర్తుంది. బాబూజీ ఆలోచనలు బోలెడన్స్ని నన్స్ను చుట్టుముట్టాయి. బాబూజీ కలం మహాత్మగాంధీ, వినోభా భావేల ఆలోచనలతోనే రచనలు చేస్తుందని అప్పుడే గుర్తించాను. వాస్తవానికి నేను రాజకీయాల్లోకి రాకముందే బాబూజీని కలిశాను. ఓ హౌసింగ్‌ సొసైటీ మరమ్మతుల విషయమై ఆయన్స్ని కలవాల్సి వచ్చింది. హౌసింగ్‌ ఫైనాన్స్ కు ఛైర్మన్స్ గా వ్యవహరిస్తూండేవారు ఆయన అప్పట్లో.

తొలి సమావేశంలోనే ఆయన నన్స్ను ఆకట్టుకున్స్నారు. స్వభావం కూడా బాగా నచ్చింది. భిన్స్నమైన వ్యక్తిత్వమని అర్థమైంది. హౌసింగ్‌ సొసైటీ సమస్యలను ఏకరవు పెట్టినప్పుడు ఆయన వాటిని వెంటనే అర్థం చేసుకోగలిగారు. సొసైటీ పేదవారికి చెందినదని తెలుసుకున్స్న తరువాత వెంటనే సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఆ సొసైటీ ఇప్పుడు ముంబైలోని శాంతాక్రూజ్‌ ప్రాంతంలో ఉంది. 

1974లో నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్స్నికయ్యాను. ఆ తరువాత బాబూజీని వేర్వేరు సందర్భాల్లో రకరకాల అంశాల విషయంలో కలిశాను. అంతేకాదు, రాజకీయాల్లో బాబూజీని (మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు) నా రోల్‌మోడల్‌గా ఎంచుకున్స్నాను కూడా. ఇష్టమైన విషయాలపై ఎంత లోతుగా తెలుసుకోవాలి, ఎంతగా ఆనందించాలి? ఇష్టం లేని విషయాలను కూడా ఎంత మేరకు పట్టించుకోవాలో నేను బాబూజీ ప్రవర్తన ద్వారా అర్థం చేసుకోగలిగాను. అందుకే ఆయన రాజకీయాల్లో ఓ ఆదర్శ వ్యక్తి అని నేను భావిస్తాను. రాజకీయాలకు అతీతంగా కూడా ఆనందం ఉందని మాకు బాగా తెలుసు. ఆ జీవితాన్స్ని కూడా అనుభవించాలి, ఆనందించాలి. అయితే ఈ విషయంలో బాబూజీ నాకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందుండేవారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మనకంటూ ఓ సిద్ధాంతం కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. బాబూజీ ఎప్పుడూ సైద్ధాంతిక, వ్యక్తిగత సంబంధాల మధ్య అంతరాన్స్ని స్పష్టంగా గుర్తించేవారు. బాబూజీకి వసంతరావ్‌ నాయక్‌ అతిదగ్గరి మిత్రుల్లో ఒకరు. అయితే రాజకీయపరమైన, సైద్ధాంతిక పరమైన విషయాల్లో వసంతరావ్‌ నాయక్‌కు (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి) దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అయితే ఎంతటి విభేదాలున్స్నా వ్యక్తిగత మైత్రిని మాత్రం వదులుకోలేదు.

బారిస్టర్‌ ఎ.ఆర్‌.అంతులే విషయంలోనూ ఇంతే. బాబూజీకి ఆయనతో మంచి సంబంధాలుండేవి. కానీ అంతులే కాంగ్రెస్‌ను వదిలేశారు. బాబూజీ మాత్రం కాంగ్రెస్‌ను, రాజీవ్‌జీని (మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ) మాత్రం వదల్లేదు. నేను రాజకీయాల్లోకి రావడానికి శరద్‌ పవార్‌ (అనంతరం, ఎన్స్సీపీ వ్యవస్థాపకుడు) కారణం. అయితే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మాత్రం ఇందిరాజీ, రాజీవ్‌జీ, పీవీ నరసింహరావుజీ, కాంగ్రెస్‌ పార్టీలకు నేను దూరం కాలేదు.

ప్రస్తుతం దేశం అలివికానీ సమస్యలు ఎదుర్కొంటోంది. విషయం రాజ్యాంగానికి సంబంధించినది. మహానేతలు మనకు అందించిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశాన్స్ని నడిపేందుకు మనం ప్రయత్నిస్తున్స్నాం. ఈ సమయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ నమ్మిన ఆలోచనలు, సిద్ధాంతాలు చాలా ముఖ్యం. ఈ సిద్ధాంతాలు, ఆలోచన ధోరణితో ముందుకెళితేనే దేశంలో శాంతి సాధ్యం. 

బాబూజీ బతికి ఉన్స్నంత కాలం మహాత్మాగాంధీ సిద్ధాంతాలనే నమ్మారు, ఆచరించారు. గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడి నట్లుగానే తన వార్తా పత్రికకు(లోక్‌మత్‌) ఆయన విశ్వాసంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారులు విజయ్‌జీ దర్డా, రాజేంద్రజీ దర్డా బాబూజీ ఆశయాలను, జాతీయత స్ఫూర్తిని కొనసా
గించే ప్రయత్నం చేస్తున్స్నారు. బాబూజీ మహారాష్ట్ర ముద్దుబిడ్డ మాత్రమే కాదు, ఈ దేశానికి సంబంధించిన ముఖ్య నేత కూడా. ఆయనకు నా మనఃపూర్వక శ్రద్ధాంజలి.

సుశీల్‌ కుమార్‌ శిందే
వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌;కేంద్ర మాజీ హోంమంత్రి
(నేడు జవహర్‌లాల్‌ దర్డా శతజయంతి) 

Advertisement
Advertisement