వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి

Published Mon, May 6 2024 5:30 AM

వైఎస్

బనశంకరి: ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మరోమారు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని వైఎస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. ఏపీలోని రాయదుర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, తంబళ్లపల్లి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, రాజంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి తరఫున ఆ పార్టీ నేతలు ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామాక్షీపాళ్యలో స్థిరపడిన రాయదుర్గం వాసులను రాయదుర్గం అభ్యర్థి గోవిందరెడ్డి తనయుడు కుశాల్‌రెడ్డి కలిసి మాట్లాడారు. ఏపీ సీఎం జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. నవరత్నాల పథకాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటరీ వ్యవస్థ, నాడు–నేడు కింద అభివృద్ధి పనులు, రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకేలపై వివరించారు. సీఎం జగనన్న అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించారన్నారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రాయదుర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే మెట్టు గోవిందరెడ్డిని గెలిపించాలన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు. ఈశ్వరరెడ్డి, రఘు పాల్గొన్నారు.

యలహంకలో...

తంబళ్లపల్లి వైఎస్సార్‌సీపీ నేతలు కన్నెమడుగు దేవిరింటి రామకృష్ణారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, నల్లగుండ్ల మల్లికార్జునరెడ్డి, కిశోర్‌రెడ్డి ఆదివారం యలహంకలో పర్యటించారు. అక్కడ నివాసం ఉంటున్న తంబళ్లపల్లి వాసులను కలిసి తంబళ్లపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, రాజంపేట లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అభివృద్ధి పథంలో నడిపించారని, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమల్లయ్యకొండ ఆలయాన్ని అభివృద్ధి చేశారన్నారు. పల్లెపల్లెకు తారు, సిమెంటు రోడ్లు నిర్మించారని తెలిపారు. ఈనెల 13వ తేదీన జరిగే పోలింగ్‌లో పాల్గొని ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వై.రామిరెడ్డి, మల్లికార్జున, శివారెడ్డి, నందీశ్వర, చౌరెడ్డి, రమణ, బాలకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
1/2

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
2/2

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement