గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు | Sakshi
Sakshi News home page

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

Published Mon, May 6 2024 5:25 AM

గిరిజ

సీతంపేట: టీడీపీ ప్రభుత్వం హయంలో ఆగిపోయిన గిరిజనమ్యూజియం పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునఃప్రారంభించింది. ఈ మేరకు సీతంపేటలోని పాత పీఎంఆర్‌సీలో మ్యూజియం పనులు జరుగుతున్నాయి. రూ.కోటి అంచనా వ్యయంతో గిరిజన మ్యూజియం నిర్మించడానికి నిధులు కేటాయించారు. 2017లో ఈ మ్యూజియానికి శంకుస్థాపన జరిగినా సక్రమంగా నిధులు కేటాయించకపోవడం, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోని కారణంగా పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్ల క్రితం ఈ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఆదిమానవుడి దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పులను చిత్రాల రూపంలో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు సీతంపేట ఏజెన్సీలో ఆదివాసీల సంస్క్రతి, సంప్రదాయాలు ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పచ్చిమబెంగాల్‌, మహరాష్ట్ర, బీహార్‌లలో ఉన్న ఆదివాసీలు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే ఆదివాసీల జీవన విధానం కంటికి కనిపించేలా బొమ్మల రూపంలో చూపించాలని నిర్ణయించారు. గిరిజనులు ఇంట్లో వాడే వస్తువులు, కట్టుబాట్లు, వేటాడే వస్తువులు, పూర్వం నుంచి ఇప్పటివరకు దశలవారీగా మారిన మార్పులను చిత్ర రూపంలో ప్రదర్శించేందుకు బొమ్మలను సేకరించారు. ప్రస్తుతానికి రెండు బ్లాకుల్లో పనులు జరిగాయి. మ్యూజియం బయట కొత్తగా కొన్ని దుకాణ సము దాయాలను ఏర్పాటు చేశారు. గిరిజన మ్యూజి యం పూర్తయితే పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందినట్లవుతుంది.

ఫ ప్రాచీన మానవుల నుంచి నేటివరకు..

బొమ్మల రూపంలో చిత్రీకరణ

ఫ గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా

రూపకల్పన

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
1/8

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
2/8

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
3/8

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
4/8

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
5/8

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
6/8

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
7/8

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
8/8

గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు

Advertisement
Advertisement