పార్వతీపురంలో అభివృద్ధి జోరు | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో అభివృద్ధి జోరు

Published Mon, May 6 2024 5:25 AM

పార్వ

●నియోజకవర్గానికి డీబీటీ నాన్‌ డీబీటీ ద్వారా రూ.1540 కోట్ల లబ్ధి

రూ.300 కోట్లతో ఇంటింటికీ

కుళాయిలు

పార్వతీపురం వ్యూ

పార్వతీపురం టౌన్‌:

కొండ, మైదాన ప్రాంతాల కలబోత పార్వతీపురం నియోజకవర్గం. పార్వతీపురం మున్సిపాల్టీ, పార్వతీపురం , సీతానగరం, బలిజిపేట మండలాలతో కూడిన నియోజకవర్గం ఒడిశా రాష్ట్రం సరిహద్దుగా విస్తరించి ఉంది. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నియోజవకవర్గంలో అభివృద్ధి పవనాలు జోరుగా వీచాయి. మల్లీ స్పెషాల్టీ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరైంది. పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. మన్యం ప్రాంతంలో వంతెన నిర్మాణాలతో రోడ్ల కష్టాలు తీరాయి. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కింద 1.84లక్షలమంది లబ్ధిదారులకు రూ.1540 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ప్రతి ఇంటా ఆర్థిక సంక్షేమం వెల్లివిరుస్తోంది.

రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల పనులు జోరుగా సాగాయి. బలిజిపేట మండలంలో 13,

సీతానగరం మండలంలో 11, పార్వతీపురం మండలంలో 15 బీటీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. పార్వతీపురం బైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయింది. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పార్వతీపురం–బొబ్బిలి వరకు 25 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు.

మేజర్‌ ప్రాజెక్టులు

గిరిజన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాకు సూపర్‌ స్పెషలిటీ హాస్పిటల్‌ నిర్మాణాని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రూ.49.56 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. గవర్నమెంట్‌ మెడికల్‌ కళాశాలకు రూ.600 కోట్ల నిధులు మంజూరు చేశారు. రూ.63 కోట్ల ఖర్చుతో పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులు చేపట్టారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.300 కోట్ల ఖర్చుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటి కుళాయిలు వేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.

సాగునీటి సదుపాయం

రైతన్నల సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. స్థానిక పాలకుల చొరవతో బలిజిపేట మండలం అంకలం నుంచి బలిజిపేట వరకూ కాలువలో సీసీ లైనింగ్‌ కోసం రూ.17 కోట్ల నిధులు మంజూరుచేసి పనులు పూర్తిచేయించింది. పెదపెంకి, అంపావల్లి, వంజరంపేట, బైరిపురం గ్రామాలకు కాలువ తవ్వించి సాగునీటి సదుపాయం కల్పించింది. తోటపల్లి రైట్‌ కెనాల్‌ నుంచి లెఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా అరసాడ, పరిసర గ్రామాల రైతుల భూములకు సాగునీరు అందించే పనులు ప్రారంభించింది. నియోజకవర్గంలోని గిరిజన రైతులకు 50,000 వేల ఎకరాలకు పోడు పట్టాలు అందజేసింది. వ్యవసాయ రాయితీలతో పాటు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించింది.

వైద్యం చేరువ

గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ధనవంతులకే పరిమతమైన ఫ్యామిలీ డాక్టర్‌ వైద్యాన్ని పల్లె ప్రజలకు చేరువ చేసింది. ఊరూరా/వార్డువార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి సుమారు 87వేల మందికి, ఫ్యామిలీ డాక్టర్‌ శిబిరాల్లో 92వేల మందికి వైద్యులు వైద్యసేవలు అందించారు. అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. పార్వతీపురం నియోజకవర్గానికి మూడు 108 అంబులెన్స్‌లు, ఒక నియోనేటల్‌ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచి సత్వర వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు.

వంతెనల నిర్మాణానికి

అధికప్రాధాన్యం

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వంతెనల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సువర్ణముఖి నదిపై గెడ్డలుప్పి–బగ్గన్నదొరవలస గ్రామాల మధ్య రూ.12కోట్ల ఖర్చు తో వంతెన నిర్మాణం పూర్తిచేసింది. సీతానగరం మండలంలోని బూర్జ– చిన అంకలం వద్ద వంతెన కోసం రూ.10కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. పార్వతీపురం మండలం తాళ్లబురిడి వద్ద సాకిగెడ్డపై వంతెన నిర్మించడంతో ప్రజల రాకపోకల కష్టాలు తొలగాయి.

మెడికల్‌

కళాశాలకు

రూ.600 కోట్ల

నిధులు

మంజూరు

రూ.49.56 కోట్లతో

మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి

స్కిల్‌

హబ్‌లతో

ఉద్యోగ

విప్లవం

ఇంటింటా

సంక్షేమ

వికాసం

పార్వతీపురం పట్టణాభివృద్ధి ఇలా..

పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేలా

రూ.2కోట్లతో రెండు పార్కుల అభివృద్ధి

రూ.2కోట్ల ఖర్చుతో బైపాస్‌ రోడ్డు

నిర్మాణం

వరహాల గెడ్డలో పూడికల తొలగింపు

రూ.1.20 కోట్లతో చెరువుల

సుందరీకరణ

పార్వతీపురంలో అభివృద్ధి జోరు
1/3

పార్వతీపురంలో అభివృద్ధి జోరు

పార్వతీపురంలో అభివృద్ధి జోరు
2/3

పార్వతీపురంలో అభివృద్ధి జోరు

పార్వతీపురంలో అభివృద్ధి జోరు
3/3

పార్వతీపురంలో అభివృద్ధి జోరు

Advertisement
Advertisement