మరో 7 రోజులు | Sakshi
Sakshi News home page

మరో 7 రోజులు

Published Mon, May 6 2024 5:25 AM

మరో 7

పార్వతీపురంటౌన్‌: సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార హోరు సాగుతోంది. కదనరంగంలో తలపడే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ప్రధాన ప్రత్యర్థులెవరో స్పష్టమైంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తలమునకలవుతున్నారు. ప్రచారానికి మరో 5 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారం హోరెత్తిస్తు న్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొంది ఉంటేనే ఓట్లేయాలని ఓటర్లను కోరుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు మాత్రం విభేదాలతో సతమతమవుతూ, ప్రచారంలో వెనుకబడుతున్నారు. ఫలితంగా డబ్బు ప్రలోభాలపై ఆధారపడుతున్నారు.

ముమ్మరంగా ప్రచారం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ మే 13న జరగనుంది. దానికి రెండు రోజుల ముందే ప్రచారం గడువు ముగుస్తుంది. దీంతో ప్రచార పర్వానికి ఇక 5 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అభ్యర్థులతో పాటు వారి బంధువులు సైతం రంగంలోకి దిగారు. దూర ప్రాంతాల్లో ఉండి చదువుతున్న, వివాహమై దూర ప్రాంతాల్లో నివసిస్తున్న, వ్యాపారాల నిమిత్తం ఇతర దేశాల్లో ఉన్న వారిని సైతం నియోజక వర్గానికి రప్పించారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కొక్కరు పంచుకుని మరీ ప్రజల వద్దకు వెళ్తున్నారు. అక్కా, అమ్మా.. అవ్వా.. తాతా.. అంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

● దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ

అధికార వైఎస్సార్‌సీపీలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై ముందుగానే స్పష్టత వచ్చింది. దీంతో వైఎస్సార్‌సీపీ అ భ్యర్థులు చాలా రోజుల నుంచే ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళ్లిన వారు..తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, వాటి ద్వారా ప్రజలు పొందిన లబ్ధిని ఇంటింటా వివరిస్తూ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. .

● సంక్షేమ పథకాలతో మరింత జోష్‌

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడి్‌డ్‌ ఐదేళ్ల పదవీకాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మరింత జోష్‌ నెలకొంది. అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంక్షేమ పథకా లు అందజేసి సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇంటింటికి వెళ్లి ధైర్యంగా ఓటు అభ్యర్థిస్తున్నారు. కూటమి నేతలు మాత్రం ఓటు అభ్యర్థించేందుకు వైఎస్సార్‌సీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక్క ఈవీఎంతోనే..

సార్వత్రిక సమరంలో పోటీ చేసే రేసుగుర్రాలపై స్పష్టత వచ్చింది. అరకు లోక్‌సభకు 13 మంది, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక్కో ఈవీఎం బ్యాలెట్‌లో అత్యధికంగా 13 మంది అభ్యర్థులకు చోటు ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 8 మంది మాత్రమే తలపడుతున్నారు. ఫలితంగా ప్రతి బూత్‌లో పోలింగ్‌ ఒక్క ఈవీఎంతోనే నిర్వహించనున్నారు.

పోలింగ్‌కు దగ్గరపడుతున్న సమయం

అరకు పార్లమెంట్‌ బరిలో 13 మంది

నాలుగు అసెంబ్లీ స్థానాలకు 29 మంది పోటీ

ప్రచారంపై అభ్యర్థుల దృష్టి

కూటమిలో సమన్వయం లేక టీడీపీ సతమతం

విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారులో గందరగోళానికి తెరతీశారు. నామినేషన్ల ఘట్టం మొదలయ్యేంత వరకూ అభ్యర్థిత్వాలపై నాన్చుడు ధోరణి అవలంబించారు. ఈ గందరగోళానికి తోడు.. క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల శ్రేణుల్లో సమన్వయం లేకపోవడం, పరస్పర విభేదాలు నెలకొనడంతో ఆ పార్టీల అభ్యర్థుల ప్రచారంలో తొలి నుంచీ నిస్తేజం అలుముకుంది. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన వాటిల్లో నేతల మధ్య కుమ్ములాటలకే సమయం సరిపోయింది. ఈ పరిణామం ప్రచారంపై చూపింది. దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలో పర్యటించిన నితిన్‌ గడ్కరీ, పాలకొండ నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. డబ్బులు ఇచ్చి జనాలను సభలకు తీసుకుని వచ్చినా.. వారు ప్రసంగిస్తుండగానే ప్రజలు వెళ్లిపోవడం ఆయా పార్టీల నేతల దుస్థితిని చెప్పకనే చెప్పింది. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్షాలకు ప్రతికూల పరిస్థితి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు వెదజల్లడం మినహా మరో మార్గం లేదని ఆయా పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ విజయ కేతనం ఎగురవేసింది. ఈసారి కుడా క్లీన్‌ స్వీప్‌ దిశగా అడుగులు వేస్తోంది.

మరో 7 రోజులు
1/4

మరో 7 రోజులు

మరో 7 రోజులు
2/4

మరో 7 రోజులు

మరో 7 రోజులు
3/4

మరో 7 రోజులు

మరో 7 రోజులు
4/4

మరో 7 రోజులు

Advertisement
Advertisement