మార్కెట్‌ తెరిపించాలని ధర్నా | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ తెరిపించాలని ధర్నా

Published Tue, Apr 23 2024 8:25 AM

సీఐ కాళ్లు మొక్కుతున్న మహిళా స్వీపర్‌
 - Sakshi

జనగామ: వ్యవసాయ మార్కెట్‌ తెరిపించి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశా రు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి నేతృత్వంలో మార్కెట్‌ గేటు ఎదుట రెండు గంటల పాటు చేపట్టిన ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు సృజన్‌, తిరుపతి, భరత్‌, పోలీసు సిబ్బంది ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం రైతు సంఘం నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌కు అందజేశారు. అంతకు ముందు ధర్నా సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునే పరిస్థి తి లేకుండా పోయిందన్నారు. రైతులు, వ్యాపారుల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి పదిహేను రోజులుగా మార్కెట్‌ మూసివేయ డం ఏమిటని ప్రశ్నించారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, సహాయ కార్యదర్శి రామావత్‌ మీట్యా నాయక్‌, వెంకట మల్లయ్య, ధర్మబిక్షం, పొత్కనూరి ఉపేందర్‌, సాయన్న, సోమయ్య, రాములు, ఆనందం, హమాలి నాయకులు రాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కాళ్లు మొక్కుత బాంచన్‌..

‘సారూ మీ కాళ్లు మొక్కుత బాంచన్‌.. మార్కెట్‌ తెరిపించండి.. పదిహేను రోజులుగా ఉపాధి కోల్పోతున్నాం.. కడుపు కాలుతున్నది’ అంటూ మహిళా స్వీపర్‌ సీఐ రఘుపతిరెడ్డిని వేడుకున్న సంఘటన సోమవారం జనగామ మార్కెట్‌ వద్ద చోటుచేసుకుంది. రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా.. మహిళా స్వీపర్‌ సీఐ కాళ్లు మొక్కి వేడుకుంది. ‘నా 30 ఏళ్ల సర్వీసులో ఏనాడూ మార్కెట్‌ బంద్‌ లేదు.. సమస్య వస్తే మాట్లాడుకున్నారే తప్ప మూసి వేయలేదు.. వ్యాపారం లేక పోతే కడుపులో ముద్ద దిగేదెట్లా’ అంటూ వాపోయింది.

రైతు సంఘం నాయకుల అరెస్ట్‌

మోకు కనకారెడ్డిని అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు
1/1

మోకు కనకారెడ్డిని అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

Advertisement
Advertisement