Director Sukumar: ఈ చిత్రకథ గొప్పగా ఉంది | Sakshi
Sakshi News home page

Director Sukumar: ఈ చిత్రకథ గొప్పగా ఉంది

Published Thu, Apr 11 2024 1:00 AM

Director Sukumar Launched Title Poster Of Virat Raj Movie Titled Goud Saab - Sakshi

– సుకుమార్‌

‘‘జగడం’ సినిమా ద్వారా గణేశ్‌ని కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేశాను. ఇప్పుడు ‘గౌడ్‌ సాబ్‌’తో తను దర్శకుడిగా మారడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రకథ గొప్పగా ఉంది’’ అన్నారు డైరెక్టర్‌ సుకుమార్‌. దివంగత నటుడు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు బంధువు విరాట్‌ రాజ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌడ్‌ సాబ్‌’. కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ దర్శకత్వంలో మల్లీశ్వరి సమర్పణలో రాజు, కల్వకోట వెంకటరమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్‌ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ఆరంభమైంది.

‘గౌడ్‌ సాబ్‌’ లోగోను సుకుమార్‌ లాంచ్‌ చేశారు. తొలి సీన్‌కి నృత్య దర్శకులు యాని, భాను, జానీ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ క్లాప్‌ కొట్టారు. ‘‘మా విరాట్‌ లాంచ్‌ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి. ‘‘ఇది నా కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది’’ అన్నారు విరాట్‌ రాజ్‌. ‘‘లవ్‌ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అన్నారు గణేశ్‌. ‘‘మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ’’ అన్నారు నిర్మాతలు.

Advertisement
 
Advertisement
 
Advertisement