Viral: RX100 Actor Karthikeya Shares His Love On Friend Lohitha - Sakshi
Sakshi News home page

Karthikeya Engagement: అక్కడే తొలిసారి లోహితను కలిశాను

Published Mon, Aug 23 2021 8:31 PM

RX100 Hero Karthikeya Shares Photo With Fiance Goes Viral - Sakshi

Karthikeya Shares Photo With Fiance: ‘‘నిట్‌ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. అప్పటి నుంచి నేటి దాకా.. దశాబ్దకాలంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఇక ముందు కూడా అలాంటి మధుర క్షణాలే. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది’’ అంటూ ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ అభిమానులతో శుభవార్తను పంచుకున్నాడు. బెస్ట్‌ఫ్రెండ్‌ లోహితతో త్వరలోనే తన వివాహం జరుగనుందని సోమవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా తమ పాత, ప్రస్తుత ఫొటోలను షేర్‌ చేశాడు.

ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లోహిత కార్తి​కేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇక ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. గుణ 369, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో పలకరించాడు. నానీ గ్యాంగ్‌లీడర్‌ మూవీలో విలన్‌గా ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం అజిత్‌ వాలిమై,  రాజా విక్రమార్క అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

చదవండి: Karthikeya Engagement: ఘనంగా కార్తికేయ నిశ్చితార్థం 

Advertisement
 
Advertisement
 
Advertisement