కొందరు చాలా అసభ్యంగా మాట్లాడేవారు.. నటి సయామి ఖేర్ ఆవేదన | Sakshi
Sakshi News home page

Saiyami Kher: అలా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది.. బాడీ షేమింగ్‌పై సయామి ఖేర్

Published Thu, Dec 8 2022 6:46 PM

Saiyami Kher was told to about body Shaming when she started acting - Sakshi

బాలీవుడ్ నటి సయామీ ఖేర్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె టాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి 2015లో ఎంట్రీ ఇచ్చింది. 'రేయ్‌' మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది మరాఠీ భామ. తాజాగా ఆమెకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది. తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు సయామి ఖేర్ ఆవేదన వ్యక్తం చేసింది ముద్దుగుమ్మ.   

(ఇది చదవండి: సాంగ్‌ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట)

సయామి ఖేర్ మాట్లాడుతూ.. 'తాను కెరీర్ ప్రారంభంలో కొందరు లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలంటూ వెటకారంగా మాట్లాడేవారు. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. ఎవరైనా శరీరం గురించి మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. తాను మందంగా ఉన్నందున అలాంటి వ్యాఖ్యలకు బాధ పడలేదు. కానీ అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం.' అంటూ వాపోయింది బాలీవుడ్ భామ. 

ఇతరుల బాడీ గురించి మాట్లాడేటప్పుడు మరింత సున్నితంగా ఉండాలని సయామి సూచించారు.  సమాజంలో చాలా సెన్సిటివ్‌గా ఉండేవారూ ఉన్నారు. మనం  ఒకరితో ఒకరు మాట్లాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. లేకపోతే ఎంతో ప్రతికూలత ఉంటుందని సయామి అన్నారు. కాగా.. ప్రస్తుతం అశ్విని అయ్యర్ తివారీ వెబ్ సిరీస్ ఫాదు: ఎ లవ్ స్టోరీలో సయామి కనిపించనుంది. ఈ సిరీస్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సిరీస్ డిసెంబర్ 9 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement