ఈ ఫోటోలోని వ్యక్తి స్టార్‌ హీరోయిన్ మదర్.. ఎవరో తెలుసా? | Guess This Actress Mother: Star Heroine Mother Photo Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Star Heroine Mother: ఈ ఫోటోలోని స్టార్ హీరోయిన్ తల్లిని గుర్తు పట్టారా?

Published Sun, Mar 3 2024 4:20 PM

Star Heroine Mother Photo Goes Viral On Social Media - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌ గతేడాది రిలీజైన సలార్‌తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. అయితే గతంలో ఆమె సింగర్‌గా కూడా సుపరిచితమే. ప్రస్తుతం జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు పాట పాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

ఇదిలా ఉండగా.. తాజాగా శృతిహాసన్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తన తల్లిదండ్రుల ఫోటోలతో వీడియోను రూపొందించింది. నాకు అమ్మా, నాన్న అంటే చాలా ఇష్టం.. వారిద్దరు నా జీవితంలో అద్భుతమైన. ప్రత్యేక వ్యక్తులని తెలిపింది. వారు నా తల్లిదండ్రులు కావడం నా అదృష్టమని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. మొదట వాణి గణపతిని పెళ్లాడిన కమల్‌ హాసన్.. ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత సారికను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అక్షర హాసన్, శృతి హాసన్ జన్మించారు. కాని అనివార్య కారణాలతో 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement