‘నీట్‌’ నుంచి మినహాయించేదాకా ఉద్యమిస్తాం | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ నుంచి మినహాయించేదాకా ఉద్యమిస్తాం

Published Mon, Aug 21 2023 6:10 AM

DMK not stop until NEET exemption is secured says MK Stalin - Sakshi

చెన్నై: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌) నుంచి తమిళనాడును మినహాయించేదాకా తమ ఉద్యమం ఆగదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తేల్చిచెప్పారు. ‘నీట్‌’ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికార డీఎంకే నేతృత్వంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను, ఆందోళనలు నిర్వహించారు. నిరాహార దీక్షలు సైత చేపట్టారు. నీట్‌ రద్దు అనేది రాజకీయపరమైన డిమాండ్‌ కాదని, అందిరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని స్టాలిన్‌ చెప్పారు.

ఈ పరీక్ష నుంచి తమిళనాడు మినహాయించేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనాలని విపక్ష ఏఐఏడీఎంకేకు స్టాలిన్‌ సూచించారు. అయితే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే నీట్‌ను తీసుకొచ్చానని ఏఐఏడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి గుర్తుచేశారు.

Advertisement
Advertisement