ఎరుకులపేట వద్ద గజరాజులు | Sakshi
Sakshi News home page

ఎరుకులపేట వద్ద గజరాజులు

Published Mon, Apr 8 2024 1:15 AM

- - Sakshi

జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ ఎరుకలపేట, వెంకటరాజపురం పరిసర ప్రాంతాలలో గజరాజులు ఆదివారం సంచరిస్తూ భయాందోళనకు గురి చేశాయి. పామాయిల్‌, అరటి, వరి పొలాలలో తిరుగుతూ పంటలను ధ్వంసం చేశాయి. రాత్రి సమయాన వెంకటరాజపురం పరిసర ప్రాంతాలలోని పామాయిల్‌ తోటలో తిష్ట వేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాన పంట పొలాలకు వెళ్లే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలున్నంత వరకు రాత్రి సమయాన పంట చేలకు వెళ్లవద్దని అటవీ సిబ్బంది హెచ్చరించారు.

సాయంత్రం వేళ ఏనుగుల షికారు

భామిని: పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఏనుగుల గుంపు విలవిల లాడుతోంది. ఈ నేపథ్యంలో భామిని మండలంలోని తాలాడ సమీపంలో తిష్ఠ వేసిన నాలుగు ఏనుగుల గుంపు ఆదివారం సాయంత్రం తరువాతే బయటకు వచ్చాయి. పెరిగిన ఎండల తీవ్రతను తట్టుకోలేక తోటల్లోనే ఉంటూ వాతావరణం చల్లబడితేనే బయటకు వచ్చి పంట పొలాల్లోకి చేరి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. చుట్టూ ఉన్న పంటలను ధ్వంసం చేసి వెంటనే సమీపంలోని వంశధార నదిలో జలకాలాటతో కాలక్షేపం చేసి సేదదీరుతున్నాయి.

సమస్యలపై దృష్టి సారిస్తున్నాం

బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌

విజయనగరం టౌన్‌: బీఎస్‌ఎల్‌ఎల్‌లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యలపై దృష్టి సారిస్తున్నామని ఆల్‌ ఇండియా బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.వరప్రసాద్‌ అన్నారు. స్థానిక రాజీవ్‌ నగర్‌ కాలనీ గాయత్రి భవన్‌లో అసోసియేషన్‌ 15వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన వి.వరప్రసాద్‌ మాట్లాడు తూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సర్కి ల్‌ అధ్యక్షుడు కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి కె.సోమసుందరం, ప్రసాదరావు, ఎన్‌ఎఫ్‌ టీ ఇ.భాస్కరరావు పాల్గొన్నారు.

సేవలకు సిద్ధమైన అగ్రి ల్యాబ్‌

నాబార్డు నిధులు రూ.3.68 కోట్లతో నెలివాడ వద్ద నిర్మాణం

రైతులకు అందనున్న సేవలు

బొండపల్లి: ౖరెతు శ్రేయస్సే ధ్యేయంగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకొకటి చొప్పున అగ్రి ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా జిల్లాలో అగ్రి ల్యాబ్‌ నిర్మాణానికి మండలంలోని నెలివాడ గ్రామంలో శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. 2020 జూన్‌ 8న ప్రస్తుత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూడు కోట్ల 68 లక్షల రూపాయిల నాబార్డు నిధులతో ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ సంస్థ ద్వారా ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టి పను లు పూర్తి చేశారు. వచ్చే ఖరీఫ్‌ నుంచి దీని ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాగులో కావాల్సిన మెలకువలతో పాటు వివిధ పంటల సాగులో ఆశించే చీడపీడలతో పాటు తెగుళ్ల నివారణ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు దీని నుంచి అందించనున్నారు.

సేవలకు సిద్ధం

రైతులకు అన్ని రకాల సేవలను అందించడానికి జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ సిద్ధమైంది. త్వరలోనే ల్యాబ్‌కు అవసరమైన ప్రయోగ పరికరాలను ఏర్పా టు చేసి సేవలు ఇక్కడ నుంచే అందించనున్నారు. ఇప్పటి వరకు వివిధ పంటలకు ఆశించే కొత్త రకాలైన తెగుళ్లతో పాటు నూతన వంగడాలు సాగు, అవలంభించాల్సిన పద్ధతులు, భూసార పరీక్షలు వంటి ప్రయోగాల కోసం ఇతర జిల్లాల ప్రయోగశాలను ఆశ్రయించాల్సి వచ్చేది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున అగ్రి ల్యాబ్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అది కాస్త కార్యరూ పం దాల్చి ఇప్పుడు నిర్మాణం పూర్తయి సేవలకు సిద్ధమైంది. ఇక ఇక్కడే అన్ని రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. సస్యరక్షణ, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర వాటిపై పరిశోధించి రైతులకు సాగులో శాస్త్రవేత్తలు సూచనలు అందించనున్నారు.

Advertisement
Advertisement