AP: పొలిటికల్ అప్‌డేట్స్ | Sakshi
Sakshi News home page

AP Political News Feb 6th: పొలిటికల్ అప్‌డేట్స్

Published Tue, Feb 6 2024 6:59 AM

AP Political Updates Feb 6th - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

07:34 PM, Feb 6, 2024 
చంద్రబాబు మట్టి మాఫియాను మేం సైతం అడ్డుకున్నాం

  • చింతలపూడి సభలో  చంద్రబాబు చిప్పుదొబ్బి తప్పుడు ఆరోపణలు చేసినట్లున్నారు
  • ఒక్క రూపాయీ అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. నిరూపించకపోతే దమ్ము ఉంటే చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకుంటాడా....?
  • చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు
  • టీడీపీ హయాంలోనే మట్టి మాఫియా ను మేము అడ్డుకున్నాము... లారీలు అడ్డుకునీ ధర్నాలు సైతం చేశాము
  • పోలవరం కుడి కాలువ గట్టు మట్టి దోచుకున్నది టిడిపి నేతలు
  •  చంద్రబాబు దోపిడీ దొంగలను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితం
  • రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు జీవితంలో రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించాడు...
  • చంద్రబాబుకు అవినీతి అనేది వెన్నతో పెట్టిన విద్య
  • దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు వచ్చిన జనసందొహాన్ని చూసి టీడీపీ శ్రేణులకు గుబులు పట్టుకుంది
  • సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన చేస్తున్నాడు
  • ఎల్లో మీడియాని పావుగా వాడుకొని ప్రభుత్వం పై బురద చల్లాలని చూస్తున్నారు..
  • గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన వైద్య, విద్య వ్యవస్థలలో సీఎం జగన్మోహన్ రెడ్డి మార్పులు తీసుకొచ్చారు
  • దేశమంతా మన వైపు చూసేలా పాలన సాగిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
  • సీఎం జగన్మోహన్ రెడ్డికి 175 కి 175 సీట్లు ఇవ్వడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు
  • రెండు లక్షల 50వేల కోట్లు జన్మభూమి కమిటీలు లేకుండా.. పేదల ఖాతాలకు చేరువు చేశారు...
  • పెత్తందారులకు పేదలకు జరిగే పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంది..
  • అమరావతినీ బూచిగా చూపి ప్రజలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు
  • వైషమ్యాలు రాకుండా మూడు రాజధానులు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారు.
  • చంద్రబాబు అనే భూతం మరోసారి గెలవకూడదని ప్రజలు కోరుకుంటున్నారు
  • పోలవరంలో జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకున్న వ్యక్తి చంద్రబాబు..
  • కమిషన్లకు కక్కుర్తి పడి ఎగువ దిగువ కాపర్ డ్యాంలు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కట్టాలని చూసాడు..
  • చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది

07:29 PM, Feb 6, 2024 
చంద్రబాబు సమక్షంలో  మధ్య డిష్యుం డిష్యుం

  • చిత్తూరు గంగాధర నెల్లూరు చంద్రబాబు సభలో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య డిష్యుం డిష్యుం
  • కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కొంతమంది జనసైనికులు నినాదాలు
  • ఉన్నపళంగా దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు
  • చంద్రబాబు సమక్షంలోనే ఈ గొడవ!

07:09 PM, Feb 6, 2024 
కాపీ కొట్టే పేటెంట్‌ బాబుదే!

  • చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చ లేదు
  • ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధం నుంచి రెండు రూపాయలకు కిలో బియ్యం వరకు అన్నింటిని ఎత్తివేశాడు 
  • చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పేద ప్రజల ఖాతాల్లో పడ్డాయా??
  • పాలకులు జవాబుదారీతనంతో ఉండాలి
  • కాపీ కొట్టే పేటెంట్ తనకే ఉన్నట్లు చంద్రబాబు వైఖరి

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
 

06:42 PM, Feb 6, 2024 
పప్పు దగ్గర రెడ్‌బుక్‌ ఉంటే ఏంటంటా?

  • చంద్రబాబుపై కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఫైర్.
  • చంద్రబాబు నీ కొడుకులా.. నా కొడుకులు అవినీతి పరులు కాదు.
  • నీ కొడుకు పెద్ద పప్పు.. నా కొడుకులు నిప్పు..
  • ప్రజలకు సేవ చెయ్యడం అలవాటు చేసుకున్నారు మావాళ్లు 
  • నీ కొడుకు పప్పు కనుక నా కొడుకులపై ఆరోపణ లు చేస్తున్నావా?
  • రూ. 300 కోట్లు కాదు 300 రూపాయిల అవినీతి నిరూపించు నేను పోటీ నుండి తప్పుకుంటా.
  • ఇళ్ళ స్థలాల కొనుగోలులో అవినీతి నిరూపించు.
  • కొల్లేరు భూములు కాజేసాను అంటున్నావ్ నిరూపించగలవా..?
  • నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు..
  • ఎర్ర బుక్ ఉంది అని లోకేష్ అంటున్నాడు 
  • జగన్ దగ్గర వైట్ బుక్ ఉంది
  • ఈ వైట్ బుక్ చూసి టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు
  • నీ కొడుకు లాగా అందరికీ పప్పు కొడుకు ఉంటాడు అనుకుంటున్నావా??
  • బీసీ బిడ్డ ఎమ్పీ అవుతున్నాడు అంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నాడు
  • నీ కొడుకు, బావమరిది ఎక్కడి నుండి వచ్చి ఎక్కడ పోటీ చేస్తున్నారు
  • వయస్సు మళ్ళిన కొద్దీ చంద్రబాబు మెంటల్ వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
  • నా కొడుకులు నిప్పులు.. వారు ప్రజాసేవ చేస్తున్నారు

06:20 PM, Feb 6, 2024 
అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

  • ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని అమలు చేసిన నిబద్ధతగల నేత సీఎం జగన్
  • ఎన్నికల తర్వాత హామీలను  మర్చిపోయే మోసకారి చంద్రబాబు
  • 12వందల కోట్లతో వైఎస్ఆర్,సీఎం జగన్ 20వేల మంది గుడివాడ ప్రజల సొంతింటి కల నిజం చేశారు
  • చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలు నుండి తప్పుకుంటా 
  • టీడీపీ నేతలు నా సవాల్ ను  స్వీకరించాలి
  • గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలు

04:20 PM, Feb 6, 2024 
పవన్‌ కళ్యాణ్‌ ముందు క్లియర్‌ పిక్చర్‌

  • జనసేన కార్యాలయంలో పవన్
  • రెండు రోజులుగా ముఖ్యనేతలతో పవన్ ప్రత్యేక సమావేశాలు 
  • రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజోలు తిరుపతి, మదనపల్లె, విశాఖ, పొన్నూరు, పాతపట్నం నేతలతో భేటీ 
  • 25 సీట్లకు ఫిక్సయిన పవన్‌ కళ్యాణ్‌
  • మరిన్ని అడగొద్దు.. తానివ్వలేనని పార్టీ నేతలకు చెబుతోన్న పవన్‌
  • ఎన్ని సీట్లు ఇచ్చినా.. ఎంత తక్కువ ఇచ్చినా.. పొత్తు ఉంటుందంటున్న పవన్‌
  • ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జెండా మోయాలని చెబుతోన్న పవన్‌

03:59 PM, Feb 6, 2024 
టీడీపీ, జనసేన  సీట్ల పంచాయితీ ఎలా ఉండనుందంటే.. 

  • నేను ఆరు పర్యాయాలు ప్రతిపాడు నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి రెండు సార్లు గెలిచాను.
  •  నియోజకవర్గం లో నా క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు.
  • అందువల్లే సీఎం జగన్ నన్ను గుర్తించి నాకు ఇన్‌ఛార్జి పదవి ఇచ్చారు.
  • నన్ను గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు
  • నవరత్నల ద్వారా సంక్షేమ పధకాలు పొందిన ప్రజలు ఎప్పటీకీ సీఎం జగన్ ను మరచిపోలేమని చెబుతున్నారు
  • టీడీపీ, జనసేన  సీట్లు ప్రకటించాక ఆ పంచాయితీ ఎలా ఉంటుందో అందరూ కళ్ళారా చూస్తారు.. చెవులారా ఆలకిస్తారు.
  • వరుపుల సుబ్బారావు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వ్యాఖ్యలు

03:49 PM, Feb 6, 2024 
గురువారం ఢిల్లీకి చంద్రబాబు?

  • పొత్తులపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు సంప్రదింపులు జరిపే అవకాశం
  • గురువారం మరోసారి పవన్‌, చంద్రబాబు సమావేశం
  • ఆ తర్వాతే ఢిల్లీకి బాబు
  • బాబు తర్వాత పవన్‌ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్‌
  • చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాతే పొత్తులపై స్పష్టత వచ్చే ఛాన్స్‌?

03:26 PM, Feb 6, 2024 
మంగళగిరి: టీడీపీకి మాదిగ నాయకుల హెచ్చరిక

  • గుంటూరు మంగళగిరి లోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం వద్ద మాదిగ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆందోళన 
  • తాడికొండ అసెంబ్లీ సీట్లు మాదిగలకు కేటాయించాలంటూ మాదిగ సంఘాలు ఆందోళన
  • వెంటనే తాడికొండ సీటును మాదిగలకు కేటాయించాలంటూ నిరసన
  • తాడికొండ సీటును మాదిగలకు ఇవ్వకపోతే తగిన బుద్ధి చెప్తామని మాదిగ నాయకులు హెచ్చరికలు

03:02 PM, Feb 6, 2024 
ధర్మానికి.. అధర్మానికి జరిగే యుద్ధం ఇది

  • సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాను
  • నేను స్థానికుడిని కావడంతో చింతల పూడిలో కేడర్ కూడా బలంగా.. ఆనందంగా ఉన్నారు
  • సీఎం జగన్‌ అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని పేదలకు చేరువు చేశారు
  • పేదల గడపలు సీఎం జగన్ మోహన్ రెడ్డిని దేవుడుగా చూస్తున్నారు
  • పేదల గడపకి పెన్షన్ చెరువు చేయడంతో ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచారు
  • జగన్‌ మా కోసం 124 సార్లు బటన్  నొక్కారు మేము రెండుసార్లు బటన్ నొక్కెందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు అంటున్నారు
  • బ్రతికున్నంతకాలం ఆయనే సీఎం చేస్తామంటూ అంటున్నారు ప్రజలు
  • కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందని అంటున్నారు ప్రజలు
  • దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి
  • టీడీపీలో దళారులు అనేక విధాలుగా దోచుకున్నారు
  • ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం ఇది
  • జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో  శత్రువులను చీల్చి చెండాడుతాడు
  • దేవుడు, న్యాయం, పేదలు సీఎం జగన్‌ వైపే ఉన్నారు
  • ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గాలిలో కలిసిపోవడం ఖాయం
  • వయసు మళ్లిన చంద్రబాబు చేసే విమర్శలు ప్రజలు పట్టించుకోరు 
  • జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 175 కు 175 ఎమ్మెల్యే సీట్లు.. 25 ఎంపీలు గెలవబోతున్నారు

చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు  కామెంట్స్

02:37 PM, Feb 6, 2024 
నూజివీడు టీడీపీలో కీలక పరిణామాలు

  • ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్సెస్‌ పార్థసారథిగా రాజకీయాలు
  • పార్థసారథి జోక్యంపై నూజీవీడు టీడీపీ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన మండిపాటు 
  • ఏలూరులో చంద్రబాబు సభకు పార్థసారథి జనసమీకరణ
  • టీడీపీ నేతలకు ఫోన్లు చేస్తుండడం కరెక్ట్‌ కాదంటూ ముద్దరబోయిన అభ్యంతరం
  • చంద్రబాబు వద్దే తేల్చుకునే యోచనలో ముద్దరబోయిన?

01:10 PM, Feb 6, 2024 
నేను అసంతృప్తిగా ఉన్నానని, పార్టీ మారుతానని దుష్ప్రచారం చేస్తున్నారు: ఎమ్మెల్యే తిప్పేస్వామి

  • దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే రాజకీయాల్లోకి వచ్చా 
  • వైఎస్సార్ వల్లే ఎమ్మెల్యేని అయ్యాను 
  • 40 ఏళ్లుగా ఆ కుటుంబాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను 
  • కొన్నికారణాల వల్ల మడకశిరకి కొత్త ఇంఛార్జిని నియమించారు 
  • పార్టీ మారే ప్రసక్తే లేదు , వ్యతిరేకం కాదు 
  • ఇప్పటికైనా తప్పుడు వార్తలు ఆపాలి
  • సీఎం వైఎస్ జగన్ నాకు ఏదో రకంగా సహాయం చేస్తారని నమ్ముతున్నా 
  •  మళ్ళీ జగన్ సీఎం అవ్వాలన్నదే మా అభిలాష

12:50 PM, Feb 6, 2024 
టీడీపీ, జనసేనపై తోట నరసింహం ఫైర్‌

  • సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణవవుతాయి.
  • వైఎస్ఆర్ వారసుడిగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారు
  • నియోజకవర్గంలో పార్టీ నేతలను, కార్యకర్తలను కలుస్తున్నాను.
  • ప్రజల నుండి నాకు మద్దతు లభిస్తుంది
  • జనసేన-టీడీపీ పొత్తుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 
  • ఇబ్బంది వచ్చేది ఆ రెండు పార్టీలకే.

12:30 PM, Feb 6, 2024 
టీడీపీ నేతలకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు: వరుదు కల్యాణి ఫైర్‌

  • అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్దు వరుదు కల్యాణి కామెంట్స్‌
  • టీడీపీ నేతలు సభలో అనవసరంగా ఆందోళన చేస్తున్నారు.
  • టీడీపీ నేతలకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు.
  • టీడీపీ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
  • కుంటిసాకులు చెబుతూ సభనుంచి వెళ్లిపోతున్నారు.
  • ధరల పెరుగుదల దేశం మొత్తం ఉంది.
  • గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఐదేళ్లలో చేసింది వివరించారు.
  • జగనన్న అభివృద్ధి ప్రజలకు తెలిస్తే తమకు ఓట్లు పడవని గొడవలు చేస్తున్నారు.
  • గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు దగ్గరగా ఉంది.
  • అభివృద్ధి, సంక్షేమంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది.
  • నాడు-నేడు ద్వారా విద్యారంగంలో భారీ మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే. 
  • చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమానికి ఏ స్థాయిలో నిధులు ఇచ్చారో చెప్పాలి.

11:50AM, Feb 6, 2024 
సామాన్య కార్యకర్తగా ఉన్న నాలాంటి మధ్యతరగతి మహిళకి మంచి అవకాశం‌ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌కి కృతజ్ణతలు

  • నరసాపురం ఎంపీగా ఎపుడూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, డబ్బులున్నవారికే అవకాశం వచ్చేది
  • సీఎం వైఎస్ జగన్ నన్ను ఎంపిక చేయడం సంతోషంగా ఉంది
  • పార్టీ ఆవిర్బావం‌ నుంచి సీఎం జగన్‌తోనే అడుగులు వేస్తున్నా
  • నా ఎంపికపై పార్టీ క్యాడర్‌లోనూ సంతోషం కనిపిస్తోంది
  • గత రెండు రోజులగా ఉండి, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలలో తిరిగా... ప్రజలలో మంచి స్పందన కనిపించింది
  • సంక్షేమ పధకాలతో అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలలో మార్పు తీసుకొచ్చేలా సిఎం వైఎస్ జగన్ పాలన సాగుతోంది
  • సచివాలయ, వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా నేరుగా ప్రజల వద్దకే పాలన
  • చంద్రబాబు 14 ఏళ్లు సిఎం గా ఉండి ఎపికి ఏం చేశారు
  • సిఎం వైఎస్ జగన్‌లా ఎందుకు సంక్షేమ‌పధకాలు అమలు చేయలేదు
  • చంద్రబాబు తానేం చేశారో చెప్పుకోలేకే జనసేనతో పొత్తు
  • మేం బలంగా ఉన్నాం కాబట్టే చంద్రబాబు పవన్ తో‌ కలిసి వస్తున్నారు
  • చంద్రబాబు బలహీనంగా ఉన్నారు కాబట్టే పొత్తులు పెట్టుకున్నారు
  • చంద్రబాబు ఎంత మందితో‌ కలిసి వచ్చినా గెలుపు మాదే... మళ్లీ  సీఎం జగనే
  • సీఎం వైఎస్ జగన్ సంక్షేమ‌పాలనే మా బలం

 నరసాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జి  గూడూరి ఉమాబాల వ్యాఖ్యలు

11:00AM, Feb 6, 2024 
పవన్‌ కల్యాణ్‌కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్‌

  • కాకినాడ సిటీ నుంచి పోటీచేసే దమ్ముందా? పవన్‌
  • నా సవాల్‌కు ఇప్పటివరకు పవన్‌ స్పందించలేదు. 
  • ఇప్పటికైనా పవన్‌ స్పందించాలి. 

10:30AM, Feb 6, 2024 
టీడీపీ సభ్యులపై అబ్బయ్య చౌదరి సీరియస్‌

  • టీడీపీ సభ్యులకు స్పీకర్‌పై గౌరవం లేదు
  • తొడలు కొడితే కుర్చీ రాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. 
  • ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైన సీఎం జగన్‌. 
  • కల్లబొల్లి మాటలు, గ్రాఫిక్స్‌ చూపించే నాయకుడు చంద్రబాబు. 
  • మాది పేదల ప్రభుత్వం. 

10:00AM, Feb 6, 2024 
పవన్ అసహాయ రాజకీయ నాయకుడు: మంత్రి చెల్లుబోయిన

  • అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి చెల్లుబోయిన కామెంట్స్‌
  • ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలి 
  • చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు 
  • తప్పు సరిదిద్దుకొనేందుకే పవన్ పార్టీ పెట్టారనుకొన్నాము 
  • చంద్రబాబు కోసం పార్టీ పెట్టారన్న విషయం బయటపడింది. 
  • లోకేష్ అవినీతి పరుడని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారితో అంటకాగుతున్నాడు 
  • ప్రజాసంక్షేమం అందించటంలో సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు 
  • పేదరిక నిర్ములనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు 
  • ఎన్టీఆర్ ఫ్యామిలీకి ద్రోహం చేసిన చంద్రబాబుకు పవన్ వంతపాడుతున్నాడు 
  • పేదలకు సాయం చేస్తున్న సీఎం జగన్‌ ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు 
  • పవన్ అసహాయ రాజకీయ నాయకుడు

8:00AM, Feb 6, 2024 

మరోసారి బోర్‌ కొట్టించిన చంద్రబాబు

  • గొండుపాలెం, చింతలపూడి సభల్లో కుర్చీలు ఖాళీ
  • అనకాపల్లి ఎంపీగా తన కుమారుడిని ఆశీర్వదించాలని సభలో అయ్యన్న ధిక్కార స్వరం
  • అయ్యన్న వ్యాఖ్యలతో తలపట్టుకున్న చంద్రబాబు
  • మాడుగుల టికెట్‌ జనసేనకు ఇచ్చినా పనిచేయాలన్న చంద్రబాబు

7:55AM, Feb 6, 2024 

నెల్లూరు సిటీ సీటుపై మడత పేచీ

  • టికెట్‌ మాకే కావాలంటున్న జనసేన
  • డ్యాన్స్‌ మాస్టర్‌ జానీని రంగంలోకి దింపే యోచన
  •  మాజీ మంత్రి నారాయణకు ఖరారైనట్లుగా ముందే టీడీపీ లీకులు
  • పొత్తులు ఖరారవకముందే ఇదేంటని జనసేన మండిపాటు

7:50AM, Feb 6, 2024 

మాజీ మంత్రి జవహర్‌కు అచ్చిబాబు వర్గం మోకాలడ్డు  

  • కొవ్వూరు నియోజకవర్గంలో పెచ్చురిల్లిన వర్గ విభేదాలు 
  • కష్టపడ్డ వాళ్లను విస్మరించారంటూ ఆశావహుల ఆగ్రహం
  • మాజీ మంత్రి జవహర్‌కు చెక్‌ పెట్టేందుకు అచ్చిబాబు వర్గం యత్నాలు
  • సీటు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం  

7:45AM, Feb 6, 2024 

ఆగని టీడీపీ సర్వే నాటకాలు

  • ఓటీపీ చెప్పాలంటూ ఇంటింటికీ తిరుగుతున్న వైనం
  • బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో స్థానికులు నిలదీయడంతో పారిపోయిన తెలుగు తమ్ముళ్లు 

7:40AM, Feb 6, 2024  

రాజమండ్రి రూరల్‌ సీటు నాదే
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • ఆ సీటు జనసేనకు కేటాయిస్తారనే వార్తల నేపథ్యంలో స్పందించిన బుచ్చయ్య
  • సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తారని గతంలో చంద్రబాబు చెప్పారు
  • తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది
  • అందుచేత జనసేన ఎక్కువ సీట్లకు ప్రయత్నిస్తోంది
  • అన్ని జిల్లాల్లో అన్ని కులాలను చూడాల్సిన అవసరం లేదు

7:15 AM, Feb 6, 2024  
పవనాలుకు కొత్త చిక్కులు!

  • చంద్రబాబు, పవన్‌కు మధ్య పలుమార్లు చర్చలు. 
  • చర్చల్లో ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. 
  • సీట్ల పంపకాలు ఎటూ తేలలేదు. 
  • దీంతో, చంద్రబాబు మీద పవన్‌కు నమ్మకం తగ్గిందని గుసగుసలు
  • చేసేదేమీ లేక తలపట్టుకున్న పవన్‌!
  • చంద్రబాబు రాజకీయమంటే ఇదే అంటున్న విశ్లేషకులు

7:00 AM, Feb 6, 2024  
వైఎస్సార్‌సీపీ ఏడో జాబితాపై కసరత్తు

  • మార్పులు చేర్పులపై ఇంకా కసరత్తులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ
  • సామాజిక సమీకరణాలతో పాటు అభ్యర్థుల గెలుపోటములు పరిగణనలోకి
  • నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు
  • సీఎంవోకు వచ్చిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌ రెడ్డి
  • నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై చర్చిస్తోన్న నేతలు
  • అతిత్వరలో ఏడో జాబితా

6:50 AM, Feb 6, 2024  
భీమిలి సభ ట్రైలర్‌.. దెందులూరు సభ ఫుల్‌ సినిమా

  • సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభకు హాజరైన ఎనిమిది లక్షల మంది ప్రజలకు ధన్యవాదాలు 
  • సీఎం జగన్ తాడేపల్లి వదిలి బైటకు రారు  అనే వాళ్లకు వణుకు  పుట్టింది  
  • సీఎం జగన్ బైటకు వస్తే ఎలా ఉంటుందో ప్రతిపక్షాలకు అర్థమైంది  
  • భీమిలి సిద్ధ సభ ట్రైలర్..  అయితే దెందులూరు సభ ఫుల్ సినిమా చూపించింది   
  • చంద్రబాబు తరుపున ప్రచారం చేసేవారందరు  స్టార్ కాంపైనర్ లు అయితే జగన్ కి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు  
  • 2024ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు  70/ టికెట్లు  కేటాయించిన ఘనత  జగన్  గారిది
  • జగన్‌ను మళ్ళీ సీఎం గా చేయటానికి ప్రజలందరూ సిద్ధం అంటున్నారు

6:40 AM, Feb 6, 2024  
ఎన్నికల వేళ..  ఈసీ కొత్త రూల్స్‌

  • ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాల పై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్
  • ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో చిన్న పిల్లలను ఉపయోగించరాదు 
  • సమావేశాలు, పోస్టర్లు, పాంప్లేట్ ల పంపిణీలో కూడా పిల్లలను ఉపయోగించకూడదు

6:30 AM, Feb 6, 2024  
కాంగ్రెస్‌ ఏపీ పాలిట విలన్‌

  • రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ
  • వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ  విజయసాయిరెడ్డి 
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు 
  • కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసింది 
  • కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు 
  • ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో  కచ్చితంగా చెప్పారు 
  • ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించ లేదు
  • 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 
  • పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయం గా  రాష్ట్రాన్ని విభజించారు 
  • ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారు 
  • ఎన్నికలలో లాభం పొందాలని ఉద్దేశంతోనే ఇలా చేశారు 
  • కాంగ్రెస్ పార్టీ ఖర్చు ఎన్నికల అవకాశవాదంతో వ్యవహరించింది 
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ కంటి తుడుపు హామీ ఇచ్చింది
  • ఏపీపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు
  • విభజన చట్టంలో ప్రత్యేక హోదా పొందుపరిచేందుకు ఎందుకు విస్మరించారు?
  • విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో ఫెయిల్ అయ్యారు
  • చట్టంలో చేర్చడం కాంగ్రెస్కు  చేతగాక, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు
  • కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదు
  • ఇప్పుడు దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారు
  • ఏపీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు 
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని అనేక సందర్భాల్లో కోరారు
  • కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్ 
  • ఇప్పుడు కుటుంబ విషయాల్లో కాంగ్రెస్‌ జోక్యం చేసుకుంటోంది
  • ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైంది 
  • జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ కనుమరుగు కావడం ఖాయం
  • 2029 నాటికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ తథ్యం
  • మిత్రపక్షాలే కాంగ్రెస్‌ను నమ్మడం లేదు
  • వచ్చే లోక్ సభ  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కంటే తక్కువ గెలుస్తుందని మమతా బెనర్జీ చెపుతున్నారు
  • 2019లో రాహుల్‌ అమేథీలో ఓడిపోయారు
  • 2024లో ఎక్కడ నుంచి పోటీ చేసినా రాహుల్‌ ఓడిపోతారు
  • కాంగ్రెస్‌ లేకుంటేనే దేశం అబివృద్ధి చెందుతుంది
  • కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయింది
  • దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ ఏమీ చేయలేదు
  • ఈ స్లోగన్‌ను ఆ పార్టీ గోడల మీద రాసుకోవాలి

Advertisement
Advertisement