
సాక్షి, విజయవాడ: రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రైతులు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డీబీటీలపై వాదనలు ముగియగా, తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.
కాగా, నిధుల విడుదలకు నిరాకరించిన ఈసీ.. పోలింగ్ తర్వాత నిధుల విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. కోడ్ వచ్చాక కొనసాగుతున్న పథకాలైనా, కొత్త పథకాలైన ఒక్కటే.. కోడ్ వచ్చాక నిధులు విడుదల చేస్తే ఓటర్లపై ప్రభావం ఉంటుందని ఈసీ తెలిపింది.
అయితే, ఇప్పటివరకు వేర్వేరు రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ కంటే ముందు అమల్లో ఉన్న అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయన్న పిటిషనర్లు.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment