అవును! నేను అన్నది నిజమే..బోస్‌పై కంగన మరో ట్వీట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

అవును! నేను అన్నది నిజమే..బోస్‌పై కంగన మరో ట్వీట్‌ వైరల్‌

Published Fri, Apr 5 2024 7:37 PM

Kangana Ranaut Defended Comment On Netaji Subhas Chandra Bose - Sakshi

సిమ్లా : సినీ నటి, హిమాచల్‌ ప్రదేశ్‌ మండి లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి కంగనా రౌనత్‌ భారత్‌కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్‌ అని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తోంది. ఈ తరుణంలో తాను చేసిన వ్యాఖ్యల్ని కంగనా సమర్ధించుకున్నారు. 

ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమ్మిట్‌లో కంగనా రనౌత్‌ మాట్లాడారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని సుభాష్‌ చంద్రబోస్‌ ఎక్కడికి వెళ్లిపోయారంటూ మాట్లాడారు. ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ట్రోలింగ్‌పై స్పందిస్తూ కంగనా ట్వీట్‌ చేశారు. అందుకు కారణాల్ని వివరిస్తూ.. నాడు ‘అక్టోబర్ 21, 1943న సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనకు తానే ప్రధాని అని ప్రకటించారంటూ ఓ జాతీయ మీడియా కథనాన్ని ట్వీట్‌ చేశారు. 

‘భారత్‌ తొలి ప్రధాని అంశంలో నన్ను విమర్శిస్తున్న వారు ఈ స్క్రిన్‌లో ఉన్న ఒక్కసారి చదవండి. నాకు కొంచెం చదువు చెప్పుచ్చు కాదా అని నన్ను అడుగుతున్న మేధావులందరికీ నేను ఒకటే చెబుతున్నా. నేను రైటర్‌ను. యాక్ట్‌ చేశా. డైరెక్షన్‌ చేశా అనే విషయాన్ని గుర్తుంచుకోండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement